News March 31, 2025
KKD: తుది జట్టు నుంచి రాజును తప్పించిన ముంబై

కాకినాడ యువ క్రికెటర్ సత్యనారాయణ రాజును ముంబై ఇండియన్స్ తన మూడో మ్యాచ్లో తుది జట్టు నుంచి తప్పించింది. తొలి రెండు మ్యాచ్‌లకు అవకాశం ఇచ్చి మూడో మ్యాచ్లో పక్కన పెట్టింది. కేకేఆర్ మ్యాచ్‌లో రాజు స్థానంలో అశ్విని కుమార్‌ను బరిలోకి దింపింది. కాగా సత్యనారాయణ రాజు రెండు మ్యాచ్ల్లో కలిపి కేవలం ఒక వికెట్ తీశారు.
Similar News
News April 3, 2025
సత్యసాయి జిల్లాకు వర్ష సూచన

శ్రీ సత్యసాయి జిల్లాలో నేడు, రేపు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. నేడు జిల్లాలోని కొన్నిచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు, శుక్రవారం తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అకాల వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉండటంతో పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని సూచించింది.
News April 3, 2025
GWL: ఈత సరదా.. ముగ్గురి ప్రాణం తీసింది!

ఈతకెళ్లి మునిగిపోయి ముగ్గురు మృతిచెందిన ఘటన నిన్న రాజోళి మండలంలో జరిగింది. ఏపీలోని కర్నూలు లక్ష్మీనగర్‌కు చెందిన సులేమాన్(47) కుటుంబంతో కలిసి సుంకేసులడ్యామ్‌కు వచ్చారు. కొడుకులు ఫర్హాన్(11), ఫైజాన్(9)లతో కలిసి సరదాగా ఈతకొట్టేందుకు దిగారు. ప్రమాదవశాత్తు కొడుకులిద్దరూ నీటిలో మునిగిపోయారు. గమనించిన తండ్రి కాపాడేందుకు వెళ్లగా, ఆయనా మునిగిపోయారు. పోలీసుల సహాయంతో మృతదేహాలను వెలికితీశారు.
News April 3, 2025
సుంకేసుల డ్యామ్ ఘటన.. మృతులు వీరే!

కర్నూలు జిల్లా సుంకేసుల డ్యామ్ వద్ద నిన్న విషాద ఘటన జరిగిన విషయం తెలిసిందే. నగరానికి చెందిన సులేమాన్ (47) తన కుమార్తెకు పదో తరగతి పరీక్షలు ముగియడంతో కుటుంబ సభ్యులతో కలిసి డ్యామ్ వద్దకు వెళ్లారు. తన కుమారులు ఫర్హాన్ (13), ఫైజాన్ (9)తో కలిసి ఈత కొట్టేందుకు నదిలోకి దిగారు. లోతు ఎక్కువగా ఉండటంతో గల్లంతయ్యారు. కాసేపటి తర్వాత మృతదేహాలు బయటపడ్డాయి. ఘటనపై గూడూరు పోలీసులు కేసు నమోదు చేశారు.