News March 31, 2025
KKR చిత్తు.. బోణీ కొట్టిన ముంబై

వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ముంబై బోణీ కొట్టింది. KKRపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 117 పరుగుల లక్ష్యాన్ని 12.5 ఓవర్లలో ఛేదించింది. రోహిత్(13) నిరాశపర్చగా, రికెల్టన్ 62*, జాక్స్ 16, సూర్య 27* రన్స్ చేశారు. రస్సెల్ 2 వికెట్లు తీశారు. అంతకుముందు బ్యాటర్లంతా విఫలమవడంతో KKR 16.2 ఓవర్లలోనే ఆలౌటైంది. MI బౌలర్లలో కుమార్ 4, చాహర్ 2, బౌల్ట్, హార్దిక్, పుతుర్, శాంట్నర్ తలో వికెట్ తీశారు.
Similar News
News February 2, 2026
నిజమైన కరుంగలి మాలను ఎలా గుర్తు పట్టాలి?

మార్కెట్లో నకిలీ మాలలు ఎక్కువగా ఉంటాయి. అందుకే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. నిజమైన కరుంగలి పూసలు బరువుగా ఉంటాయి. నీటిలో వేస్తే వెంటనే మునిగిపోతాయి. నకిలీవి తేలుతాయి. నిజమైన పూసలు సహజమైన నలుపు రంగులో ఉంటాయి. తాకితే నునుపుగా, చల్లగా అనిపిస్తాయి. వీటిపై ఎటువంటి రంగు పూత ఉండదు. ఓ పూసను నీటిలో నానబెట్టినప్పుడు నీరు రంగు మారకూడదు. అసలైన కలప కాంతిని సహజంగా ప్రతిబింబించాలి.
News February 2, 2026
అత్తింటి వేధింపులు.. ముగ్గురు పసిపిల్లల్ని చంపి..

కర్ణాటకలోని బగల్‌కోట్‌లో ముగ్గురు పసిపిల్లలను ఉరేసి చంపిన ఓ తల్లి డీజిల్ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఇంట్లో ఎవరూలేని సమయంలో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు. నిన్న మధ్యాహ్నం ఇంటిలోపలి వైపు తాళం వేసి ఉండగా స్థానికుల సాయంతో భర్త డోర్ ఓపెన్ చేశారు. పిల్లలు అప్పటికే చనిపోగా చావుబతుకుల్లో ఉన్న భార్య(రూప)ను ఆసుపత్రికి తరలించారు. అత్తింటి వేధింపులే కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
News February 2, 2026
805 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్(C-DAC)805 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం పోస్టుల్లో హైదరాబాద్‌లో 105 పోస్టులు ఉన్నాయి. అర్హతగల వారు ఫిబ్రవరి 20 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్, పీజీ(సైన్స్, MCA, PhD అర్హత గల అభ్యర్థులు అర్హులు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ /స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://cdac.in


