News October 30, 2024

KKR రిటెన్షన్స్ ఆ ఆటగాళ్లే కావొచ్చు: భజ్జీ

image

ఈ ఏడాది ఐపీఎల్ గెలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు రిటెన్షన్స్ చాలా కష్టమని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డారు. ఎవర్ని అట్టిపెట్టుకోవాలన్నది నిర్ణయించుకోవడం ఇబ్బందేనని పేర్కొన్నారు. ‘సీజన్ అంతా అద్భుతంగా ఆడిన KKRకి కొంతమందినే రిటెయిన్ చేసుకోవడం ఈజీ కాదు. కానీ నా దృష్టిలో శ్రేయస్, ఫిల్ సాల్ట్, నరైన్, రస్సెల్, రింకూ సింగ్, రమణ్‌దీప్ సింగ్‌ను ఆ జట్టు కొనసాగిస్తుంది’ అని అంచనా వేశారు.

Similar News

News October 30, 2024

వారికి టెన్త్‌లో పాస్ మార్కులు 10 మాత్రమే

image

AP: వచ్చే ఏడాది మార్చి-ఏప్రిల్‌లో జరిగే టెన్త్ పరీక్షలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక అవసరాలు కలిగిన(మెంటల్ బిహేవియర్, ఇంటెలెక్చువల్ డిజేబిలిటీ) విద్యార్థులకు పాస్ మార్కులను 10(గతంలో 35)గా నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ దేవానందరెడ్డి ఉత్తర్వులిచ్చారు. అన్ని సబ్జెక్టుల్లోనూ 10 మార్కులు వస్తే చాలని పేర్కొన్నారు.

News October 30, 2024

నవాబ్ మాలిక్‌కు మద్దతివ్వం: బీజేపీ

image

దావూద్ ఇబ్రహీంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నేత నవాబ్ మాలిక్ NCP(అజిత్ పవార్) తరఫున నామినేషన్ దాఖలు చేశారు. అయితే మాలిక్‌కు తాము మద్దతు ఇవ్వట్లేదని BJP నేతలు తెలిపారు. దావూద్‌తో సంబంధాలు ఉన్నవారికి మద్దతు ఇవ్వబోమని స్పష్టం చేశారు. కూటమి పార్టీలు తమకు నచ్చిన నేతను ఎంపిక చేసుకునే అవకాశం ఉందన్నారు. సిట్టింగ్ స్థానాన్ని వదిలేసిన మాలిక్ మన్ఖుర్డ్-శివాజీ నగర్ నుంచి బరిలో ఉన్నారు.

News October 30, 2024

ఆయిల్ ఎగుమతుల్లో సౌదీని దాటేసిన భారత్

image

యూరప్ దేశాలకు రిఫైన్డ్ ఫ్యూయెల్ అత్యధికంగా సప్లై చేస్తున్న దేశంగా భారత్ నిలిచింది. ఈ క్రమంలో భారత్.. సౌదీ అరేబియా, రష్యాను అధిగమించింది. యూరప్ ఆంక్షలు విధించడంతో రష్యా ఆయిల్ ఎగుమతులు తగ్గిపోయాయి. దీంతో మన దేశం రష్యా నుంచి తక్కువ ధరకు ముడి చమురు కొనుగోలు చేసి, ఆయిల్ కంపెనీల్లో శుద్ధి చేస్తుంది. ప్రస్తుతం రోజుకు 3.60 లక్షల రిఫైన్డ్ ఆయిల్ బ్యారెళ్లను యూరప్ దేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు తెలుస్తోంది.