News March 28, 2025
కేకేఆర్vsలక్నో మ్యాచ్ రీషెడ్యూల్

ఏప్రిల్ 6న (ఆదివారం) కేకేఆర్-లక్నో మధ్య జరగాల్సిన మ్యాచును రీషెడ్యూల్ చేసినట్లు బీసీసీఐ వెల్లడించింది. పండుగల కారణంగా తగినంత భద్రత కల్పించలేమని పోలీసులు చెప్పారని.. దీంతో ఆ మ్యాచును ఏప్రిల్ 8న నిర్వహిస్తామని పేర్కొంది. ఇక ఏప్రిల్ 6న గుజరాత్-SRH మ్యాచ్ ఒకటే ఉంటుందని తెలిపింది.
Similar News
News November 23, 2025
ఉపాధి హామీ పథకం.. 48 గంటల్లో కొత్త కార్డు

AP: ఉపాధి హామీ పథకం కింద కొత్త జాబ్ కార్డుల జారీ, బోగస్ కార్డుల తొలగింపునకు ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది. ఈకేవైసీ ప్రక్రియతో అధికారులు 7.44 లక్షల బోగస్ కార్డులను గుర్తించి రద్దు చేశారు. తొలగించిన కార్డుల వివరాలను గ్రామాల్లో వారం రోజులు ప్రదర్శిస్తారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి 48 గంటల్లో కార్డులు మంజూరు చేస్తారు. ఈ ఏడాది కొత్తగా 3.47L మందికి ప్రభుత్వం కార్డులు ఇచ్చింది.
News November 23, 2025
అల్పపీడనం.. అతి భారీ వర్షాలు

AP: ద.అండమాన్ సముద్ర పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడిందని IMD వెల్లడించింది. ఇది రేపటికి వాయుగుండంగా, ఈనెల 30 నాటికి తుఫానుగా మారుతుందని అంచనా వేసింది. ఉత్తర కోస్తాకు తుఫాను ముప్పు పొంచి ఉందని, NOV 28 నుంచి వర్షాలు పెరుగుతాయని తెలిపింది. అలాగే ఉత్తరాంధ్రలో భారీ-అతిభారీ వర్షాలు పడతాయని పేర్కొంది. ఇవాళ ప్రకాశం, నెల్లూరు, KDP, అన్నమయ్య, చిత్తూరు, TPT జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని APSDMA ప్రకటించింది.
News November 23, 2025
ఆశపడి వెల్లుల్లితిన్నా రోగం అట్లాగే ఉందట

వెల్లుల్లి ఆరోగ్యానికి మంచిదని, కొన్ని రోగాలను నయం చేస్తుందని చాలా మంది నమ్ముతారు. అయితే ఆ ఘాటును భరించి తిన్నా ఎలాంటి మార్పు లేకపోతే నిరాశే ఎదురవుతుంది. అలాగే ఏదైనా ఒక లక్ష్యాన్ని సాధించడానికి ఎంతో ప్రయాసపడి, కష్టపడి ప్రయత్నించినప్పటికీ, చివరికి ఫలితం శూన్యమైనప్పుడు లేదా పరిస్థితిలో పురోగతి లేనప్పుడు ఈ సామెతను సందర్భోచితంగా వాడతారు.


