News November 27, 2024

KKR మరో టైటిల్ గెలుస్తుంది: ఉమ్రాన్ మాలిక్

image

తనను జట్టులోకి తీసుకున్నందుకు ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ KKRకు ధన్యవాదాలు తెలిపారు. ఆ జట్టు జెర్సీ ధరించడానికి ఆత్రుతతో ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. KKR డిఫెండింగ్ ఛాంపియన్స్ అని, మరో టైటిల్ గెలుస్తుందన్నారు. గతంలో SRHకు ఆడిన మాలిక్ తన వేగమైన బంతులతో అందరి దృష్టిని ఆకర్షించారు. నిలకడ లేమితో ఆ జట్టు వదులుకోగా వేలంలో తొలుత అన్‌సోల్డ్‌గా నిలిచారు, ఆపై KKR బేస్ ప్రైస్ రూ.75లక్షలకు దక్కించుకుంది.

Similar News

News November 17, 2025

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కు నోటీసులు

image

MLAల పార్టీ ఫిరాయింపు ఇతర పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారించింది. కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై స్పీకర్‌కు నోటీసులు జారీ చేసింది. ఫిరాయింపు MLAలపై 3నెలల గడువులో ఎందుకు చర్యలు తీసుకోలేదో వివరణ ఇవ్వాలని, 4 వారాల్లో విచారణ పూర్తి చేయాలని ఆదేశించింది. అయితే కేసును పాస్ ఓవర్ చేయాలని ప్రభుత్వ న్యాయవాదులు కోరారు. దీంతో సుప్రీంకోర్టు పాస్ ఓవర్ చేసింది. ఈరోజు సాయంత్రం కేసును విచారించే అవకాశం ఉంది.

News November 17, 2025

US నుంచి LPG దిగుమతి.. తగ్గనున్న ధరలు: హర్దీప్‌సింగ్

image

అమెరికా నుంచి LPGని దిగుమతి చేసుకునేందుకు కీలక ఒప్పందం కుదిరిందని కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్ తెలిపారు. ‘ఏడాదిపాటు ఈ డీల్ అమల్లో ఉంటుంది. IND కంపెనీలు 2.2MTPA ఇంపోర్ట్ చేసుకుంటాయి. ఇది మొత్తం వార్షిక దిగుమతుల్లో 10 శాతానికి సమానం. ప్రజలకు మరింత తక్కువ ధరకు LPGని అందించడంలో ఇదొక ముందడుగు. ప్రస్తుతం సిలిండర్ ధర ₹1100 ఉన్నప్పటికీ ₹500-550కే అందిస్తున్నాం’ అని పేర్కొన్నారు.

News November 17, 2025

మాట్లాడుకుంటేనే సమస్యలకు పరిష్కారం

image

భార్యాభర్తల ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు వస్తుంటాయి. కొన్నిసార్లు అహం, ఇంకొన్నిసార్లు అపార్థాలు పలకరిస్తాయి. అలకలూ ఉంటాయి. వాటిని దాటితేనే బంధం పదిలంగా మారుతుంది. అభిప్రాయ భేదాలు వచ్చి అలిగినా తెగేదాకా లాగొద్దు. పరోక్ష వ్యాఖ్యానాలు చేయొద్దు. నేరుగానే పరిష్కరించుకోండి. సమస్య ఏదైనా ఎదుటివారికి మాట్లాడే అవకాశం ఇవ్వాలి. లేదంటే సమస్య పరిష్కారం కాకపోగా అవతలివారిలో రోజు రోజుకీ అసంతృప్తి పెరిగిపోతుంది.