News March 29, 2024
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న KKR
RCBతో మ్యాచ్‌లో టాస్ గెలిచిన KKR బౌలింగ్ ఎంచుకుంది.
కోల్‌కతా నైట్ రైడర్స్: ఫిలిప్ సాల్ట్, వెంకటేశ్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్(C), రింకూసింగ్, నరైన్, రస్సెల్, రమణ్‌దీప్ సింగ్, స్టార్క్, అనుకుల్ రాయ్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: డుప్లెసిస్(C), కోహ్లీ, పాటిదార్, మాక్స్వెల్, గ్రీన్, దినేశ్ కార్తీక్, అనుజ్ రావత్, అల్జారీ జోసెఫ్, దగర్, సిరాజ్, యశ్ దయాల్.
Similar News
News February 5, 2025
తండ్రి అయ్యేందుకు 11వేల కి.మీలు ప్రయాణం
దక్షిణ చిలీలోని ‘పార్క్ టంటాకో’ అటవీ ప్రాంతాల్లో ఉండే డార్విన్స్ కప్పలకు ప్రాణాంతక కైట్రిడ్ ఫంగస్ సోకినట్లు 2023లో గుర్తించారు. దీంతో ఈ జాతి అంతరించిపోకుండా ఉండేందుకు చేపట్టిన ఎమర్జెన్సీ మిషన్‌లో మగ కప్పలను యూకేకు తరలించారు. దీనికోసం బోటు, విమానం, కారులో ఇలా 11వేల కి.మీలకు పైగా ప్రయాణించాయి. ఎట్టకేలకు ఈ అసాధారణ విధానం ద్వారా యూకేలో 33 పిల్లలు జన్మనిచ్చాయి. ఇవి 2గ్రాముల కంటే తక్కువ బరువుంటాయి.
News February 5, 2025
విడదల రజినీపై కేసుకు హైకోర్టు ఆదేశం
AP: మాజీ మంత్రి విడదల రజినీపై 2 వారాల్లోగా కేసు నమోదు చేయాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. కేసు వివరాలను తమకు పంపాలని పేర్కొంది. 2019లో రజినీని ప్రశ్నించినందుకు తనను చిత్రహింసలకు గురి చేశారంటూ పిల్లి కోటి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. తనపై తప్పుడు కేసులు పెట్టించి పోలీసులతో కొట్టించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు రజినీపై కేసు నమోదు చేయకపోవడంతో కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు.
News February 5, 2025
కొత్త జెర్సీలో భారత ప్లేయర్లు
ఇంగ్లండ్‌తో జరిగే వన్డే సిరీస్‌కు టీమ్ఇండియా సిద్ధమైంది. కొత్త జెర్సీతో టీమ్ సభ్యులు దిగిన ఫొటోలను బీసీసీఐ షేర్ చేసింది. భుజాల వద్ద జాతీయ జెండా రంగు పెద్దగా కనిపించేలా దీనిని డిజైన్ చేశారు. ఎంతో స్టైలిష్ & క్లాసీ లుక్‌తో ఉన్న జెర్సీలో మన ప్లేయర్లు అదిరిపోయారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. రేపు విదర్భ స్టేడియంలో తొలి వన్డే జరగనుంది. జెర్సీ ఎలా ఉందో కామెంట్ చేయండి.