News December 5, 2024
KL-జైస్వాల్ ఓపెనింగ్ చేస్తారు: రోహిత్ శర్మ

రేపటి నుంచి జరిగే అడిలైడ్ టెస్టులో కేఎల్ రాహుల్, యశస్వీ జైస్వాల్ ఓపెనింగ్ చేస్తారని రోహిత్ శర్మ వెల్లడించారు. తొలి టెస్టులో జైస్వాల్‌తో కలిసి KL నెలకొల్పిన భాగస్వామ్యం విజయంలో కీలక పాత్ర పోషించిందన్నారు. విదేశాల్లో బ్యాటింగ్ చేసిన విధానం వల్ల అతను ఓపెనింగ్‌కు అర్హుడని చెప్పారు. తాను మధ్యలో ఎక్కడో చోట బ్యాటింగ్ చేస్తానని ప్రకటించారు. ఈ నిర్ణయం వ్యక్తిగతంగా తనకు కష్టమైనా జట్టుకు మంచి చేస్తుందన్నారు.
Similar News
News March 31, 2026
ప్రభాస్ బిజీబిజీ.. ఈ ఏడాదే ‘ఫౌజీ’?

‘రాజాసాబ్’ డ్యామేజ్ నుంచి బయటపడేందుకు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన నెక్స్ట్ సినిమా ‘ఫౌజీ’పై ఎక్కువ ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. దీనిని ఈ ఏడాదే రిలీజ్ చేసేలా షూటింగ్ ప్లాన్ చేసినట్లు సమాచారం. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. దీంతోపాటు ‘కల్కి-2’, ‘స్పిరిట్’ సినిమాల షూటింగ్స్‌లోనూ పాల్గొంటూ ఆయన బిజీగా ఉంటున్నట్లు సినీవర్గాలు తెలిపాయి.
News March 31, 2026
పెళ్లికి ముందు ఈ టెస్టులు చేయించుకోండి!

పెళ్లికి జాతకాలతో పాటు మెడికల్ టెస్టులు చేయించుకోవడం కూడా ఎంతో ముఖ్యమని వైద్యులు సూచిస్తున్నారు. ‘బ్లడ్ గ్రూప్, హిమోగ్లోబిన్ స్థాయులు, HIV, హెపటైటిస్-B &C, VDRL, రుబెల్లా వంటి పరీక్షలు కాబోయే జంటలు చేయించుకోవాలి. ఇవి దంపతుల ఆరోగ్యానికే కాకుండా, పుట్టబోయే బిడ్డలకు జన్యుపరమైన లోపాలు, ప్రాణాంతక వ్యాధులు రాకుండా రక్షణనిస్తాయి’ అని చెబుతున్నారు. SHARE IT
News March 31, 2026
బాలామృతమా… బాలల పాలిట విషమా!

TG: అంగన్వాడీ సెంటర్లలో అందిస్తున్న పాలపొడి, ఇతర పదార్థాలు విషతుల్యంగా మారుతున్నాయి. కాలంచెల్లిన సరకుకు కొత్త లేబుల్స్ అంటించి కాంట్రాక్టర్లు అందిస్తున్నారు. వీటిలో ఫంగస్, బాక్టీరియా ఉన్నట్లు స్టేట్ ఫుడ్ ల్యాబ్ రిపోర్ట్ తేల్చింది. కమీషన్ల మత్తులో అధికారులు చర్యలకు బదులు హెచ్చరికలతో సరిపెడుతున్నారు. 35700కు పైగా అంగన్వాడీ కేంద్రాలుండగా వీటిలో పోషకాహారానికి FY25-26లో GOVT ₹156 CR ఇచ్చింది.


