News March 11, 2025

ఢిల్లీ కెప్టెన్సీ రేసులో కేఎల్ రాహుల్, అక్షర్

image

IPLలో అన్ని జట్లు తమ కెప్టెన్లను ప్రకటించగా ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం సస్పెన్స్‌లో ఉంచింది. ఆ జట్టులో సీనియర్ ప్లేయర్లు కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ కెప్టెన్సీ రేసులో ఉన్నట్లు క్రీడా వర్గాలు చెబుతున్నాయి. రాహుల్ పంజాబ్ కింగ్స్ 2, లక్నోకు 3 సీజన్లలో సారథ్యం వహించారు. ఇక అక్షర్ పటేల్ ఆల్‌రౌండర్‌గా ఢిల్లీకి చాలా ఏళ్లుగా సేవలందిస్తున్నారు. వీరిద్దరిలో మీ ఛాయిస్ ఎవరు? కామెంట్ చేయండి.

Similar News

News March 12, 2025

లిఫ్ట్ ఎక్కుతున్నారా? ఒక్క నిమిషం!

image

ఇళ్లు, ఆఫీస్‌లు, అపార్ట్‌మెంట్లు, షాపింగ్ మాల్స్‌లో నిత్యం లిఫ్ట్‌లు వాడుతుంటాం. కానీ ఎలివేటర్ల నిర్వహణ లోపం వల్ల ఇటీవల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అప్రమత్తతో వీటిని నివారించుకోవచ్చు. మీరు బటన్ నొక్కగానే లిఫ్ట్ మీ ఫ్లోర్‌కు వచ్చిందో లేదో ఒక్కసారి చూసుకోండి. ఒక్కోసారి లిఫ్ట్ క్యాబిన్ రాకున్నా డోర్లు తెరుచుకుంటాయి. చూడకుండా అందులోకి ఎక్కాలని చూస్తే కిందపడి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది.

News March 12, 2025

ఢిల్లీలో అంతర్జాతీయ భద్రతా సదస్సు

image

ఈ నెల 16న ఢిల్లీలో అంతర్జాతీయ భద్రతా సదస్సు జరగనుంది. అమెరికా, కెనడా, బ్రిటన్‌తో సహా 20 దేశాల గూఢచర్య విభాగాల అధినేతలు పాల్గొనే ఈ కార్యక్రమానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అధ్యక్షత వహిస్తారు. ఉక్రెయిన్-రష్యా, గాజా యుద్ధం, తీవ్రవాదం, అంతర్జాతీయ నేరాలను ఎదుర్కోవడం వంటి అంశాలపై వీరు చర్చించనున్నారు. ఆస్ట్రేలియా, జర్మనీ, న్యూజిలాండ్ దేశాల ఇంటెలిజెన్స్ చీఫ్‌లు కూడా ఈ సమావేశానికి రానున్నారు.

News March 12, 2025

ఈ నెల 15న తణుకుకు సీఎం చంద్రబాబు

image

AP: ఈ నెల 15న పశ్చిమగోదావరిలోని తణుకులో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో భాగంగా నిర్వహించే ప్రజావేదికలో ప్రసంగిస్తారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయ వస్తువుల ప్రదర్శనను ఆయన ప్రారంభిస్తారు. సీఎం రాక నేపథ్యంలో జిల్లా కలెక్టర్ నాగరాణి, ఎస్పీ అద్నాన్ నయీమ్ ఏర్పాట్లను సమీక్షించారు. పర్యటన షెడ్యూల్ ఇవాళ లేదా రేపు ఖరారు కానుంది.

error: Content is protected !!