News April 28, 2024

KL రాహుల్ మరో ఘనత

image

ఐపీఎల్‌లో లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ మరో ఘనత సాధించారు. ఐపీఎల్‌లో 4,000 పరుగులు పూర్తి చేసుకున్న నాలుగో ఓపెనర్‌గా రాహుల్ నిలిచారు. రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆయన ఈ ఘనత అందుకున్నారు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ (4041) రికార్డును అధిగమించారు. 94 ఇన్నింగ్స్‌ల్లోనే ఆయన ఈ రికార్డు నెలకొల్పారు. అగ్రస్థానంలో శిఖర్ ధవన్ (6362) ఉన్నారు.

Similar News

News November 17, 2025

ఇంకో 20 ఏళ్లు హీరోగా నటిస్తూనే ఉంటా: బాలకృష్ణ

image

AP: ఇంకో 20 ఏళ్లు హీరోగా నటిస్తూనే ఉంటానని సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చెప్పారు. ప్రపంచంలో 50 ఏళ్లుగా హీరోగా కొనసాగుతున్నది తానొక్కడినేనని అన్నారు. శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ‘రాజకీయం అంటే ఏంటో ఎన్టీఆర్ నేర్పారు. బీసీలకు అధికారాన్ని పంచిన మహానుభావుడు’ అని అన్నారు. హిందూపురం ప్రజలకు తాను రుణపడి ఉంటానని చెప్పారు.

News November 17, 2025

నవంబర్ 17: చరిత్రలో ఈరోజు

image

*1920: తమిళ నటుడు జెమినీ గణేశన్ జననం
*1928: భారత జాతీయోద్యమ నాయకుడు లాలా లజపతిరాయ్ మరణం (ఫొటోలో)
*1972: సినీ నటి, రాజకీయ నేత రోజా సెల్వమణి జననం
*1978: నటి కీర్తి రెడ్డి జననం
*1982: మాజీ క్రికెటర్, ఎంపీ యూసుఫ్ పఠాన్ జననం
*2012: శివసేన పార్టీ వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే మరణం
*అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవం

News November 17, 2025

శుభ సమయం (17-11-2025) సోమవారం

image

✒ తిథి: బహుళ త్రయోదశి తె.5.09 వరకు
✒ నక్షత్రం: చిత్త తె.5.20 వరకు
✒ శుభ సమయాలు: సా.7.45-8.10.
✒ రాహుకాలం: ఉ.7.30-9.00 వరకు
✒ యమగండం: ఉ.10.30-మ.12.00
✒ దుర్ముహూర్తం: మ.12.24-1.12 వరకు, మ.2.46-3.34
✒ వర్జ్యం: మ.12.04-1.40
✒ అమృత ఘడియలు: రా.10.49-12.31