News November 8, 2024
తండ్రి కాబోతున్న కేఎల్ రాహుల్

భారత క్రికెటర్ కేఎల్ రాహుల్, ఆయన సతీమణి అతియా శెట్టి త్వరలో పేరెంట్స్ కాబోతున్నారు. 2025లో తాము బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు ఈ స్టార్ కపుల్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. 2023 జనవరిలో వీరికి వివాహమైంది. అతియా బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కూతురు అనే విషయం తెలిసిందే.
Similar News
News October 30, 2025
అజహరుద్దీన్‌కు మంత్రి పదవి ఆఫర్.. సీఎంపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు!

TG: మంత్రివర్గ విస్తరణను వెంటనే ఆపేలా ఆదేశించాలని ఈసీకి బీజేపీ ఫిర్యాదు చేసింది. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేళ అజహరుద్దీన్‌కు మంత్రి పదవి ఆఫర్ చేసి సీఎం రేవంత్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC)ని ఉల్లంఘించారంటూ అందులో పేర్కొంది. ఇది నియోజకవర్గంలోని ఒక వర్గం ఓటర్లను ప్రభావితం చేసేలా ఉందని ఆరోపించింది. ఎన్నికల నిబంధన ఉల్లంఘించిన సీఎంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
News October 30, 2025
పారిశుద్ధ్య పనులకు మొబైల్ బృందాలు: పవన్

AP: మొంథా తుఫాను ప్రభావం ప్రజల ఆరోగ్యంపై పడకుండా చూడాలని Dy.CM పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ‘పకడ్బందీగా పారిశుద్ధ్య పనుల కోసం మొబైల్ బృందాలు, రోడ్ల పునరుద్ధరణకు తక్షణ చర్యలు, తాగునీటి సరఫరాకు ఇబ్బందులున్న చోట్ల ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలి’ అని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం తుఫాను వల్ల కలిగిన నష్టాన్ని అంచనా వేసే పనిలో పడింది. పంట, ఆస్తినష్టం వివరాలను ప్రజల నుంచి వాట్సాప్‌లో సేకరిస్తోంది.
News October 30, 2025
రోజూ లిప్‌స్టిక్ వాడుతున్నారా?

పెదాలు అందంగా కనిపించడానికి చాలామంది మహిళలు లిప్‌స్టిక్ వాడుతుంటారు. అయితే వీటిలో ఉండే రసాయనాలతో అనారోగ్యాలు వస్తాయంటున్నారు నిపుణులు. చాలా లిప్‌స్టిక్‌ల తయారీలో కాడ్మియం, సీసం, క్రోమియం, అల్యూమినియం రసాయనాలు వాడతారు. వీటిని దీర్ఘకాలం వాడటం వల్ల శ్వాసకోశ, జీర్ణ వ్యవస్థలు దెబ్బతినడం, ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తాయని హెచ్చరిస్తున్నారు. లెడ్ ఫ్రీ, నాన్ టాక్సిక్ ఉత్పత్తులను వాడాలని సూచిస్తున్నారు.


