News March 10, 2025

KL రాహుల్.. ది అన్‌సంగ్ హీరో!

image

2023 వన్డే WC ఓడిపోవడానికి ఇతనే కారణం. పంత్ ఉండగా ఇతడినెందుకు ఆడిస్తున్నారు. కీపింగ్ సరిగా చేయట్లేదు. ఇవన్నీ CTలో KL రాహుల్‌పై వచ్చిన విమర్శలు. ‘నేను ఇంకేం చేయాలి?’ అని ఇటీవల రాహుల్ అన్నారంటే ఆ విమర్శల తీవ్రత ఏంటో అర్థం అవుతోంది. సెమీ ఫైనల్‌లో AUSతో మ్యాచులో సిక్స్ కొట్టి గెలిపించడమే కాకుండా ఫైనల్‌లో టీమ్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నప్పుడు రాహుల్(34*) ఆడిన తీరు అద్భుతం. జట్టును గెలిపించిన తీరు అద్వితీయం.

Similar News

News November 21, 2025

నవంబర్ 23 నుంచి ఓపెన్ యూనివర్సిటీ తరగతులు ప్రారంభం

image

డా. బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ అధ్యయన కేంద్రం, నిజామాబాదులో డిగ్రీ 1, 3, 5వ సెమిస్టర్‌తో పాటు, పీజీ (MBA) మొదటి సెమిస్టర్, పీజీ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు క్లాసులు ప్రారంభం కానున్నాయి.
నవంబర్ 23 ఆదివారం ఉదయం నుంచి తరగతులు ప్రారంభమవుతాయని ప్రిన్సిపల్ డా.పి. రామ్మోహన్ రెడ్డి, సమన్వయకర్త డా. కె. రంజిత తెలిపారు. విద్యార్థులు తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు.

News November 21, 2025

టార్గెట్ 1 రన్.. భారత్ ఘోర ఓటమి

image

ACC మెన్స్ ఆసియా రైజింగ్ స్టార్స్ టోర్నీ <<18351488>>సెమీస్‌లో<<>> బంగ్లా-Aతో జరిగిన మ్యాచులో భారత్-A చిత్తుగా ఓడిపోయింది. మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీయగా మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా సున్నాకే 2 వికెట్లు కోల్పోయింది. ఒక పరుగు టార్గెట్‌తో బరిలోకి దిగిన బంగ్లా తొలి బంతికి వికెట్ కోల్పోయింది. తర్వాతి బంతిని బౌలర్ సుయాష్ శర్మ వైడ్ వేయడంతో బంగ్లా గెలిచింది. ఈ ఓటమితో భారత్-A జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది.

News November 21, 2025

కొత్త లేబర్ కోడ్‌లో ఉపయోగాలు ఇవే..

image

* వారానికి 48 గంటల పని, ఓవర్ టైమ్ వర్క్ చేస్తే రెట్టింపు వేతనం
* కార్మికులకు తప్పనిసరిగా అపాయింట్‌మెంట్ లెటర్లు
* ఫిక్స్‌ట్-టర్మ్ ఎంప్లాయిమెంట్ ద్వారా కాంట్రాక్ట్ వర్కర్లకు భద్రత, పర్మనెంట్ ఉద్యోగుల మాదిరి చట్టపరణమైన రక్షణ
* అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సామాజిక న్యాయం
* భూగర్భ మైనింగ్, భారీ యంత్రాల వంటి పనులకూ మహిళలకు అనుమతి