News November 4, 2024
ఇండియా-Aకు ఆడనున్న KL.. కారణమిదే!

NZతో టెస్ట్ సిరీస్‌లో ప్రాక్టీస్ లభించని ఆటగాళ్లను ఇండియా-A తరఫున ఆడించాలని BCCI నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో భాగంగా KL రాహుల్, ధృవ్ జురెల్‌ను రేపు ఆస్ట్రేలియాకు పంపనున్నట్లు క్రీడా వర్గాలు తెలిపాయి. AUS-A, IND-A మధ్య జరిగే మ్యాచుల్లో వీరు ఆడనున్నట్లు పేర్కొన్నాయి. రాహుల్‌కు NZ సిరీస్‌లో తొలి టెస్ట్ మాత్రమే ఆడే అవకాశం రాగా, జురెల్ వికెట్ కీపింగ్ మాత్రమే చేసిన సంగతి తెలిసిందే.
Similar News
News February 3, 2026
మణిపుర్ కొత్త సీఎంగా యుమ్నాం ఖేంచంద్

మైతేయి, కుకీ జాతుల మధ్య హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఏడాది కాలంగా రాష్ట్రపతి పాలనలో ఉన్న మణిపుర్ రాష్ట్రానికి కొత్త CM ఖరారయ్యారు. BJP సీనియర్ నేత, మాజీ స్పీకర్ యుమ్నాం ఖేంచంద్ సింగ్‌ను ముఖ్యమంత్రిగా ఆ పార్టీ శాసనసభాపక్షం ఎన్నుకుంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆయన.. శాంతి భద్రతల పునరుద్ధరణ, జాతుల మధ్య సామరస్యాన్ని నెలకొల్పడం వంటి సవాళ్లు ఎదుర్కోనున్నారు.
News February 3, 2026
అందుకే ట్రంప్ మొదట అనౌన్స్ చేశారు: గోయల్

ట్రేడ్ డీల్ గురించి US అధ్యక్షుడు ట్రంప్ ముందే ప్రకటించడంపై ప్రతిపక్షాలు విమర్శిస్తున్న వేళ మంత్రి గోయల్ క్లారిటీ ఇచ్చారు. టారిఫ్స్ తగ్గించినట్లు మొదట అమెరికానే ప్రకటించిందని అందుకే ట్రంప్ మాట్లాడారని వివరించారు. టారిఫ్స్ విధించినప్పుడు ప్రకటన చేసినట్టే ఇప్పుడు కూడా ట్రంప్ చెప్పారని అన్నారు. కాగా ట్రంప్ కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఏకపక్షంగా నిర్ణయాలు ప్రకటిస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి.
News February 3, 2026
రాహుల్ దేశాన్ని తప్పుదోవపట్టిస్తున్నారు: గోయల్

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ద్వంద్వ వైఖరిని అనుసరిస్తున్నారని వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ విమర్శించారు. రాహుల్ లాంటి నెగటివ్ ఆలోచనలు కలిగిన వ్యక్తులు దేశాన్ని తప్పుదోవపట్టిస్తున్నారని మండిపడ్డారు. దేశ పురోగతి గురించి వారికి పట్టింపు లేదన్నారు. రాహుల్ సహా విపక్ష ఎంపీలు పార్లమెంటులో స్పీకర్ పట్ల అవమానకరంగా ప్రవర్తించారన్నారు. అందుకే పార్లమెంటులో మాట్లాడాల్సిన విషయం ఇక్కడ చెప్పాల్సి వచ్చిందన్నారు.


