News March 19, 2024
వైజాగ్ బీచ్లో క్లీంకార, రామ్ చరణ్
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు. భార్య ఉపాసన, కూతురు క్లీంకారతో కలిసి విశాఖ బీచ్లో ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. క్లీంకారను బీచ్లో ఆడిస్తూ సరదాగా గడిపారు. ఇందుకు సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. ఇక రామ్ చరణ్ ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నారు.
Similar News
News October 1, 2024
ఆస్పత్రిలో చేరిన సూపర్ స్టార్ రజినీకాంత్?
సూపర్ స్టార్ రజినీకాంత్ చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తమిళ మీడియా వర్గాలు తెలిపాయి. ముందస్తు చికిత్సలో భాగంగా ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఆధ్వర్యంలో ఎలక్టివ్ ప్రొసీజర్ కోసం ఆయన ఆస్పత్రిలో చేరినట్లు పేర్కొన్నాయి. ఆయనకు వైద్యులు గుండెకు సంబంధించిన టెస్టులు, చికిత్స చేయనున్నట్లు సమాచారం.
News October 1, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News October 1, 2024
శుభ ముహూర్తం
తేది: అక్టోబర్ 1, మంగళవారం
చతుర్దశి: రా.9.39 గంటలకు
పుబ్బ: ఉ.9.15 గంటలకు
వర్జ్యం: సా.5.24- రా.7.12 గంటల వరకు
దుర్ముహూర్తం: ఉ.8.21 నుంచి ఉ.9.09 గంటల వరకు
తిరిగి రా.10.44 నుంచి రా.11.32 గంటల వరకు
రాహుకాలం: మ.3.30 నుంచి సా.4.30 వరకు