News September 25, 2024

KLPR: అన్ని కళాశాలల్లో ఇన్‌ఛార్జ్‌ల పాలన

image

KLPR: మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రాతినిధ్యం వహిస్తున్న కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 5 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. కొల్లాపూర్ పట్టణంలో ప్రభుత్వ బాలుర, బాలికల జూనియర్ కళాశాలలు, పానగల్, వీపనగండ్ల, కోడేరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలల్లో శాశ్వత ప్రాతిపదికన ప్రిన్సిపళ్లు లేకపోవడంతో ఇన్‌ఛార్జ్‌ల పాలనలో నడుస్తున్నాయి. పదోన్నతుల ద్వారా ఈ పోస్టులు భర్తీ చేయవలసి ఉంది.

Similar News

News February 22, 2026

పాలమూరు: సీఎం కప్ నెట్‌బాల్ ఫైనల్‌కు నారాయణపేట జట్టు

image

మహబూబ్‌నగర్‌లో జరుగుతున్న రెండో రాష్ట్రస్థాయి సీఎం కప్-2026 నెట్‌బాల్ పోటీల్లో నారాయణపేట జిల్లా బాలుర జట్టు ఫైనల్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా జిల్లా నెట్‌బాల్ అసోసియేషన్ ప్రతినిధులు డా. శెట్టి రమేశ్, డా. రామ్మోహన్ గౌడ్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు. రేపు జరగబోయే తుది పోరులో జట్టు విజయం సాధించాలని వారు ఆకాంక్షించారు.

News February 21, 2026

పాలమూరు: జిల్లాలో నేటి ముఖ్యంశాలు

image

✒ MBNR: క్రీడలతోనే మానసిక స్థైర్యం – ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి
✒ MBNR:AIU వైస్ ఛాన్సలర్స్ మీట్‌లో పీయూ వీసీ
✒ నాగర్‌కర్నూల్‌లో రోడ్డు ప్రమాదం.. కారు, బైక్ ఢీ.. వ్యక్తి మృతి
✒ ఈనెల 21న బడుల్లో పేరెంట్స్ మీటింగ్: డీఈవో
✒ NGKL:SLBC పనులు ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తి
✒ పలుచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్
✒ ఇంటర్ పరీక్షలపై ప్రత్యేక ఫోకస్

News February 20, 2026

MBNR: AIU వైస్ ఛాన్సలర్స్ మీట్‌లో పీయూ వీసీ

image

హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ సెంట్రల్ జోన్ వైస్ ఛాన్సలర్స్ మీట్ 2025-26 నిర్వహించారు. “Creating AI & Quantum enabled Higher Educational Institutions” అనే అంశంపై ఈ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పీయూ వీసీ జిఎన్.శ్రీనివాస్ హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌తో పాటు సెంట్రల్ జోన్ వైస్ ఛాన్సలర్స్ కూడా పాల్గొన్నారు.