News August 3, 2024

KMM:ఈ నెల 5 నుంచి మోగనున్న పెళ్లిబాజాలు

image

ఆషాఢమాసం ముగిసి శ్రావణమాసం రానున్న తరుణంలో ఈ నెల 5 నుంచి పెళ్లిబాజాలు మోగనున్నాయి. దాదాపు 3 నెలల విరామం తర్వాత పెళ్లిళ్ల కోసం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కళ్యాణ మండపాలను సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 5 నుంచి 31 వరకు వివాహాలకు మంచి ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. సెప్టెంబర్ నెల భాద్రపద మాసంలో ముహూర్తాలు లేవని, మళ్లీ అశ్వయుజ, కార్తీక, మార్గశిర మాసంలో ముహూర్తాలు ఉన్నాయని చెబుతున్నారు.

Similar News

News September 7, 2024

అధికారులను అలర్ట్ చేసిన జిల్లా కలెక్టర్

image

జిల్లా వ్యాప్తంగా ఉన్న 589 మంది పంచాయితీ కార్యదర్శులు ఆయా పంచాయతీల్లో అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ ఆదేశించారు. గ్రామపంచాయతీ పరిధిలోని వాగులు కాలువలు కల్వర్టుల దగ్గర ప్రజలు దాటకుండా ఉండేందుకు రోడ్లు బ్లాక్ చేయాలన్నారు. ఆయా గ్రామ పంచాయతీల్లో ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. చేపల వేటకు వెళ్లకుండా ఆపాలన్నారు. ఎమ్మార్వోలు ఎంపీడీవోలు నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.

News September 7, 2024

UPDATE: 8.75 అడుగుల వరకు చేరిన మున్నేరు నీటిమట్టం

image

ఖమ్మంలో కురుస్తున్న భారీ వర్షం కారణంగా మున్నేరువాగు వరద 7.26 గంటల వరకు 8.75 అడుగులకు చేరిందని ఖమ్మం మున్సిపల్ అధికారులు తెలిపారు. దాన్వాయిగూడెం , రమణపేట, బొక్కలగడ్డ, ప్రకాష్ నగర్, మోతీ నగర్, వెంకటేశ్వర్ నగర్‌లోని మున్నేరు వెంబడి నివసించే ప్రజలను సమీపంలోని రెస్క్యూ సెంటర్‌కు వెళ్లవలసిందిగా మున్సిపల్ అధికారులు తెలిపారు..

News September 7, 2024

HIGH ALERT: ఖమ్మం జిల్లాకు అతిభారీ వర్షాలు 

image

ఖమ్మం జిల్లాకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాగల మూడు రోజులు జిల్లాలో విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేసింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మున్నేరు, ఆకేరుకు భారీ వర్షాల వల్ల వరద పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు, ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఉండాలని పేర్కొంది.