News March 19, 2024
KMM:రైలు కింద పడి యువకుడి బలవన్మరణం

చింతకాని మండలం అనంతసాగర్ సమీపంలో మల్లెల కుటుంబరావు (30) అనే వ్యక్తి సోమవారం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. నేలకొండపల్లి మండలం ముజ్జుగూడెంకు చెందిన కుటుంబరావు కొంతకాలంగా అత్తగారి ఊరైన అనంతసాగర్లో నివసిస్తున్నాడు. సోమవారం ఓ ఎక్స్ ప్రెస్ రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు రైల్వే ఎస్సై పారుపల్లి భాస్కర్ రావు తెలిపారు.
Similar News
News April 8, 2025
కేయూలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్!

కాకతీయ యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వర్సిటీలో మొత్తం 258 పోస్టులకు గానూ 77 మంది మాత్రమే పని చేస్తున్నారు.ఇంకా 181 పోస్టుల ఉన్నాయి. అకడమిక్ రికార్డ్, పరిశోధనలు, విషయ పరిజ్ఞానం, బోధన నైపుణ్యం, ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. కాగా ఈ పోస్టుల్లో ఎన్ని భర్తీ చేస్తారనే విషయాన్ని ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు.
News April 8, 2025
భద్రాద్రి: భార్య మందలించిందని.. భర్త ఆత్మహత్య

మద్యానికి బానిసై ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన భద్రాద్రి జిల్లా ఇల్లెందు మండలం ధనియాలపాడులో జరిగింది. ఎస్ఐ నాగుల్ మీరా తెలిపిన వివరాలిలా.. కారేపల్లి మండలం చేన్నంగులగుట్టకు చెందిన డి.సురేశ్ కొంత కాలంగా మద్యానికి బానిసయ్యాడు. దీంతో భార్య మందలించడంతో ధనియాలపాడులోని ఓ జామాయిల్ తోటలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య వెంకటరమణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
News April 8, 2025
ఖమ్మం: వివాహేతర సంబంధం.. వ్యక్తి ప్రాణం తీసింది!

మహిళ క్షణికావేశంలో ఓ వ్యక్తిని నెట్టివేయడంతో గోడకు తగిలి మృతిచెందిన ఘటన ఖమ్మంలో చోటుచేసుకుంది. ఖానాపురం పోలీసుల వివరాలిలా.. ఏలూరు జిల్లా చింతలపూడి మండలానికి చెందిన రవిప్రసాద్ గత కొద్దిరోజులుగా ఖమ్మం నగరంలో ఓ మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఆదివారం రాత్రి ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.. రవిప్రసాద్ను పక్కకు నెట్టివేయడంతో తలకు గాయాలై మృతి చెందాడు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.