News February 16, 2025

KMM: అనారోగ్యంతో వైద్య విద్యార్థి మృతి

image

అనారోగ్యానికి గురై వైద్య విద్యార్థి మృతి చెందిన ఘటన కారేపల్లి మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. భీక్య తండాకు చెందిన వాంకుడోత్ అఖిల్ (22) ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. గత కొద్ది రోజులుగా అనారోగ్యానికి గురైన అఖిల్ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు చెప్పారు. డాక్టర్ కావలసిన వాడు మృతి చెందడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Similar News

News November 23, 2025

ప్రకాశం జిల్లా ఇన్‌ఛార్జ్ ఎస్పీగా బాపట్ల ఎస్పీ

image

బాపట్ల ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ప్రకాశం జిల్లా ఇన్‌ఛార్జ్ ఎస్పీగా నియమించబడ్డారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా ఎస్పీగా ఉన్న హర్ష వర్ధన్ రాజు డిసెంబర్ 2 వరకు సెలవుల్లో ఉన్నారు. ఆ సమయంలో బాపట్ల ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ప్రకాశం జిల్లాకు ఇన్‌‌ఛార్జ్ ఎస్పీగా బాధ్యతలు నిర్వహించనున్నారు. ఈ మేరకు బాపట్ల ఎస్పీ కార్యాలయ ప్రతినిధులు ఆదివారం ఈ విషయాన్ని ఒక ప్రకటన ద్వారా తెలిపారు.

News November 23, 2025

ప్రకాశం జిల్లా ఇన్‌ఛార్జ్ ఎస్పీగా బాపట్ల ఎస్పీ

image

ప్రకాశం జిల్లా ఇన్‌ఛార్జ్ ఎస్పీగా బాపట్ల ఎస్పీ ఉమామహేశ్వర్ నియమించబడ్డారు. ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు డిసెంబర్ రెండు వరకు సెలవుల్లో ఉండడంతో, ప్రభుత్వం ఈ మేరకు బాపట్ల ఎస్పీని ఇన్‌ఛార్జ్‌గా నియమించింది. దీనితో జిల్లా బాధ్యతలను బాపట్ల ఎస్పీ ఉమామహేశ్వర్ చేపట్టారు. డిసెంబర్ మూడో తేదీన ఎస్పీ హర్షవర్ధన్ రాజు మళ్లీ విధుల్లో చేరనున్నారు.

News November 23, 2025

పొల్యూషన్​ నుంచి కాపాడే ఫుడ్స్ ఇవే

image

ప్రస్తుతం వాయుకాలుష్యం పెద్ద సమస్యగా మారింది. లైంగిక పరిపక్వత, హార్మోన్ల అసమతుల్యత వంటి అనేక సమస్యలు వస్తున్నాయి. ఇలా కాకుండా ఉండాలంటే బెర్రీస్, బ్రోకలీ, పసుపు, ఆకుకూరలు, చేపలు ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటితో పాటు తృణధాన్యాలు, లీన్ ప్రొటీన్లు కలిగిన విభిన్న ఆహారాలను చేర్చుకోవడం వల్ల కాలుష్యం నుంచి మిమ్మల్ని రక్షించుకోగలుగుతారని చెబుతున్నారు.