News February 16, 2025
KMM: అనారోగ్యంతో వైద్య విద్యార్థి మృతి

అనారోగ్యానికి గురై వైద్య విద్యార్థి మృతి చెందిన ఘటన కారేపల్లి మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. భీక్య తండాకు చెందిన వాంకుడోత్ అఖిల్ (22) ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. గత కొద్ది రోజులుగా అనారోగ్యానికి గురైన అఖిల్ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు చెప్పారు. డాక్టర్ కావలసిన వాడు మృతి చెందడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News March 28, 2025
ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన ఏపీ ప్రొఫెసర్

APకి చెందిన ఫిజిక్స్ ప్రొఫెసర్, VSU వైస్ ఛాన్సలర్ అల్లం శ్రీనివాస రావు ప్రపంచ దిగ్గజ శాస్త్రవేత్తలలో ఒకరిగా గుర్తింపు పొందారు. ప్రపంచంలోని టాప్ 2% శాస్త్రవేత్తలలో ఒకరిగా ఆయన నిలిచినట్లు స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో వెల్లడైంది. భౌతిక శాస్త్ర రంగానికి ఆయన చేసిన కృషికి దక్కిన ఫలితం ఇది. ఆయన వివిధ అంతర్జాతీయ జర్నల్స్‌కు 250కి పైగా శాస్త్రీయ వ్యాసాలు రాసి ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందారు.
News March 28, 2025
భార్యను తీసుకురావడానికి వెళ్తూ.. భర్త మృతి

భార్యను ఇంటికి తీసుకురావడానికి బైక్ పై వెళ్తూ.. రోడ్డు ప్రమాదంలో భర్త మృతిచెందిన ఘటన సత్తుపల్లి పట్టణం శివారులో చోటుచేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం నాగుపల్లికి చెందిన మట్ల వెంకటేశ్వరరావు (35) భార్య భవాని సత్తుపల్లిలోని జీవి మాల్‌లో పనిచేస్తుంది. ఆమెను ఇంటికి తీసుకెళ్లేందుకు వస్తుండగా ఓ పానీపూరి బండిని ఢీకొట్టాడు. సత్తుపల్లి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
News March 28, 2025
పార్వతీపురం జిల్లాలో భానుని ప్రతాపం

పార్వతీపురం మన్యం జిల్లాలో భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. పాచిపెంట, సాలూరు, భామినిలో సహా మిగిలిన మండలాలో రాబోయే 48 గంటలు 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదు కానుంది. దీంతో ఆ మండల వాసులు తగిన జాగ్రత్తలు పాటించాలని వాతావరణ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.