News March 16, 2025

KMM: అనుమానంతో భార్యను, మరొకరిని నరికిన భర్త

image

వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారనే అనుమానంతో భార్యతో పాటు మరొకరిని భర్త కొడవలితో నరికిన ఘటన ఖమ్మం పరిధిలోని ఓ గ్రామంలో జరిగింది. ఇద్దరిపై వేటకొడవలితో దాడి చేయగా వారి పరిస్థితి విషమంగా ఉంది. భర్త పరారీలో ఉన్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.

Similar News

News March 14, 2026

KNR: బాలికతో వివాహం.. కేసు నమోదు: ఎస్‌ఐ

image

KNR(D) శంకరపట్నం మండలంలో ఓ బాలికకు బాల్య వివాహం చేయడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై శేఖర్ ‌రెడ్డి పేర్కొన్నారు. ఐసీడీఎస్ సూపర్‌వైజర్ చెన్నూరి పద్మ ఇచ్చిన పిటిషన్ మేరకు, ముద్రవేణి సంపత్, శోభల కుమారుడు ముద్రవేణి రాజ్ కుమార్‌కు బాలికతో చట్టవిరుద్ధంగా వివాహం నిర్వహించారు. దీంతో బాలిక తల్లిదండ్రులపై, సంపత్, శోభా, రాజ్ కుమార్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 14, 2026

రొద్దంలో గ్యాస్ గోదాము తనిఖీ

image

రొద్దంలోని విజయలక్ష్మి ఇండేన్ గ్యాస్ గోదామును జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోదాములోని ఎల్‌పీజీ సిలిండర్ల నిల్వలను స్వయంగా పరిశీలించి స్టాక్ రిజిస్టర్లను తనిఖీ చేశారు. నిల్వలు, రికార్డులు సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించారు. డోర్-టు-డోర్ డెలివరీ విధానాన్ని పరిశీలించి వినియోగదారులకు గ్యాస్ సిలిండర్లు సమయానికి అందుతున్నాయా అని తెలుసుకున్నారు.

News March 14, 2026

సిద్దిపేట: ‘సమాజ దిశ మార్చేది కవిత్వమే’

image

సమాజంలోని రుగ్మతలను తొలగించి, సరైన దిశానిర్దేశం చేసే శక్తి కవిత్వానికే ఉందని ప్రముఖ కవి కోడం పవన్ కుమార్ అన్నారు. సిద్దిపేటలో ‘వెన్నెల సాహితీ సంఘం’ ఆధ్వర్యంలో జరిగిన కవి సమ్మేళనంలో ప్రసంగించారు. సమాజంలో పెరుగుతున్న అసహనం ప్రమాదకరమని, దీనిని చక్కదిద్దాల్సిన బాధ్యత కవులదేనని పేర్కొన్నారు. పాలకుల లోపాలను నిర్మొహమాటంగా ప్రశ్నించే ధైర్యం కవులకే ఉంటుందన్నారు. యాదగిరి, అశోకరాజు తదితరులు పాల్గొన్నారు.