News January 30, 2025
KMM: అర్చకులకు గుడ్ న్యూస్… నిధులు విడుదల

ఖమ్మం జిల్లాలోని వెనుకబడిన ఆలయాల నిర్వహణకు రూపొందించిన ధూప దీప నైవేద్యాలు (డీడీఎన్) పథకం నిధులు విడుదలయ్యాయి. 2024 నవంబర్, డిసెంబర్ నెలల్లో పెండింగ్ బకాయిలను అర్చకుల ఖాతాల్లో దేవాదాయ శాఖ అధికారులు జమ చేశారు. ఖమ్మం జిల్లా లోని 330 దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు ఒక్కొక్కరికి రూ.20 వేల చొప్పున వారి ఖాతాల్లో జమయ్యాయి.
Similar News
News February 18, 2025
ఖమ్మం: ఆర్టీసీ కార్గోకి కాసుల వర్షం

ఖమ్మం రీజియన్‌లో ఆర్టీసీ కార్గోకి కాసుల వర్షం కురుస్తోంది. గతేడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు 3,29,743 ద్వారా రూ.6,49,30,640 ఆదాయం వచ్చింది. అత్యధికంగా మే నెలలో జిల్లాలో 35,199 పార్శిళ్ల బుకింగ్ ద్వారా రూ.68,46,890 ఆదాయం సమకూరింది. అలాగే డిసెంబర్‌లో 33,588 పార్శిళ్ల ద్వారా రూ.68,97,835 ఆదాయం లభించింది. అలాగే ఇతర ప్రాంతాలకు 1,740 పార్శిళ్లు హోం డెలివరీ ద్వారా రూ.4,84,050 ఆదాయం వచ్చింది.
News February 18, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభం ∆} వివిధ శాఖల అధికారులతో ఖమ్మం జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన ∆} ఖమ్మంలో మంత్రి తుమ్మల పర్యటన ∆} మధిరలో విద్యుత్ సరఫరాల అంతరాయం ∆} ఖమ్మంలో రైతుల మహా ధర్నా కార్యక్రమం∆} తల్లాడలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
News February 18, 2025
కనకగిరి ఫారెస్ట్‌లో నిపుణుల పర్యటన

కనకగిరి ఫారెస్ట్‌లో వన్యప్రాణి నిపుణులు 12గంటల పాటు కాలినడకన పర్యటించారు. 12 మంది నిపుణులు 4 కీ.మీ.ల అడవిని పరిశీలించి వృక్షాలు, జంతువులకు సంబంధించిన వైవిధ్యాన్ని కనుగొన్నారు. 65 పక్షిజాతులు, 5 క్షీరద జాతులు, 5 చేప జాతులను డాక్యుమెంటరీ రూపంలో రికార్డు చేశారు. ఫారెస్ట్ ప్రకృతి దృశ్యాలు, వన్యప్రాణుల రకాలు ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామంగా ఉంటుందని పేర్కొన్నారు.