News May 12, 2024

 KMM: అస్వస్థతకు గురైన పోలింగ్ సిబ్బంది 

image

వెంకటాపురం మండలం‌లోని ఎన్నికల డిస్ట్రిబ్యూటర్ కేంద్రంలో విధి నిర్వహణలో ఉన్న పోలింగ్ సిబ్బంది ఒకరు హఠాత్తుగా అస్వస్థతకు గురై కింద పడిపోయారు. మండల విద్యాశాఖ రికార్డు అసిస్టెంట్ జంగిటి స్వామి ఎన్నికల సామగ్రి తీసుకొని పోలింగ్ కేంద్రానికి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా అస్వస్థతకు గురయ్యారు. గమనించిన తోటి సిబ్బంది ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించారు. 

Similar News

News February 16, 2025

ఖమ్మం: మృతదేహం లభ్యం.. హత్య? ఆత్మహత్య?

image

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెం- మేడిదపల్లి గ్రామాల మధ్యలో ఉన్న కాల్వకట్ట పక్కన గుర్తు తెలియని మృతదేహం లభ్యమవడం స్థానికంగా కలకలం రేపింది. మృతదేహాన్ని చూసిన కొందరు స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకొని, దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్య?.. లేదా హత్య?.. అనే కోణంలో విచారిస్తున్నారు. మృతుడు పాతర్లపాడుకు చెందిన కొల్ల సైదులుగా గుర్తించారు.

News February 16, 2025

ఖమ్మం జిల్లాలో BRS PINK బుక్ ఫీవర్

image

BRS నేతలపై కక్షపూరితంగా వ్యవహరించిన వారి పేర్లు పింక్ బుక్‌లో రాయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించిన విషయం విదితమే. అయితే గత 10 రోజుల కింద ఖమ్మం మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కూడా ఈ విషయమై తీవ్రంగా ధ్వజమెత్తారు. జిల్లాలో కార్యకర్తలపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని, వారి పేర్లు పింక్ డైరీలో రాస్తున్నామని, వారికి వడ్డీతో సహా చెల్లిస్తామనడం, ఇటీవల కవిత మాటలతో పింక్ బుక్ హాట్ టాపిక్‌ అయింది.

News February 16, 2025

ఖమ్మం మోడ్రన్ రైల్వే స్టేషన్ పనులు వేగవంతం

image

ఖమ్మం రైల్వే స్టేషన్‌ను కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రూ.25 కోట్లతో ఆధునీకరిస్తున్న విషయం తెలిసిందే. అయితే పనులు తుది దశకు చేరుకున్నాయని, త్వరలో అందుబాటులోకి వస్తుందని అధికారులు అంటున్నారు. ఇప్పటికే ఓవర్ బ్రిడ్జి, విశ్రాంతి హాల్ నిర్మాణాలు పూర్తి చేసుకొన్నాయి. 70 శాతం పనులు పూర్తయ్యాయంటున్నారు. ప్లాట్ ఫాం ఆలస్యమవుతుందని తెలుస్తోంది. త్వరగా పూర్తి చేయాలని జిల్లావాసులు కోరుతున్నారు.

error: Content is protected !!