News December 8, 2024
KMM: ఆర్టీసీ ఏసీ బస్సుల్లో 10% రాయితీ
టిజిఎస్ ఆర్టీసీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న ఏసీ బస్సుల్లో బేసిక్ టికెట్ చార్జిపై 10% రాయితీ సౌకర్యం కల్పిస్తున్నట్లు ఖమ్మం జిల్లా రీజినల్ మేనేజర్ సరి రామ్ తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి ఏసీ బస్సులు ఉన్న అన్ని రూట్‌లలో రాయితీ ఈ నెల 31 వరకు వర్తిస్తుందని తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. సీట్ బుకింగ్ కొరకు www.tgsrtcbus.in సంప్రదించాలన్నారు.
Similar News
News December 27, 2024
మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరనిలోటు: ఎంపీ రామసహాయం
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా ఖమ్మం సంజీవరెడ్డి భవనంలో శుక్రవారం ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, PSR యూత్ అధ్యక్షుడు దుంపల రవికుమార్ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఆయన మృతి దేశానికి తీరని లోటని ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి తెలిపారు. వారి వెంట కాంగ్రెస్ నేతలు ఉన్నారు.
News December 27, 2024
ఇల్లందు – కారేపల్లి రహదారిపై రోడ్డుప్రమాదం
సింగరేణి మండల పరిధిలోని ఇల్లందు – కారేపల్లి ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బైక్‌లు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతిచెందిన వ్యక్తిని ఉసిరికాయలపల్లికి చెందిన మల్లయ్యగా స్థానికులు గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఇల్లందు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వారిలో వెంకటేశ్వర్లు పరిస్థితి విషమంగా ఉండటంతో ఖమ్మం తీసుకెళ్లారు.
News December 27, 2024
మన్మోహన్ సింగ్ మృతి పట్ల పొంగులేటి సంతాపం
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి దేశానికి తీరని లోటన్నారు. మన్మోహన్ సింగ్ కుటుంబానికి, అభిమానులకు పొంగులేటి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ దేశంలో అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారని గుర్తుచేసుకున్నారు. కేంద్రమంత్రిగా, ప్రధానిగా దేశానికి నిర్విరామంగా సేవలందించారని కొనియాడారు.