News March 21, 2025
KMM: ఇందిరమ్మ ఇళ్లకు 69,536 అర్హుల గుర్తింపు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల ఆశావహులకు ఇటీవలి బడ్జెట్ ఆశాజనకంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్లకు రూ.12,571 కోట్లు కేటాయించగా, ఖమ్మం జిల్లాలో 37,444, భద్రాద్రి జిల్లాలో 32,092 మంది అర్హులను గుర్తించారు, లిస్ట్ ఫైనల్ చేసి తుది జాబితా విడుదల చేయాల్సి ఉంది. అతి త్వరలోనే లిస్ట్ రిలీజ్ చేసే సూచనలు కనిపిస్తుండగా, స్థానికంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
Similar News
News October 16, 2025
రేపు ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి పర్యటన

ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రేపు(శుక్రవారం) ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నట్లు ఆయన క్యాంపు కార్యాలయం ఇంఛార్జి ఓ ప్రకటనలో తెలిపారు. మంత్రి ఉదయం 10:30 గంటలకు ఖమ్మం చేరుకుంటారు. అనంతరం అధికారులతో నిర్వహించే సమీక్షలో పాల్గొంటారు. మధ్యాహ్నం ఆయన పలు ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
News October 16, 2025
నేర దర్యాప్తులో ఆధారాలు కీలకం: CP సునీల్ దత్

నేర దర్యాప్తులో ఆధారాలు చాలా కీలమని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. పోలీస్ కమిషనర్ కార్యాలయ ఆవరణలో గల భవనంలోని ఆధునికరించిన ఫింగర్ ఫ్రింట్ యూనిట్ కార్యాలయాన్ని గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నేర పరిశోధనలో ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుంటూ, ఫింగర్ ఫ్రింట్ యూనిట్లలోని కార్యాచరణను వేగవంతం చేయడానికి ఆటోమేటెడ్ సిస్టమ్లను ఉపయోగిస్తున్నారని అన్నారు.
News October 16, 2025
విద్యార్థులకు వ్యాస రచన పోటీలు: ఖమ్మం సీపీ

పోలీస్ ఫ్లాగ్ డేను పురస్కరించుకొని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆన్లైన్ వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. పోటీల్లో తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ 3 భాషల్లో 6వ తరగతి నుంచి పీజీ వరకు ఉన్న విద్యార్థులు పాల్గొనవచ్చని చెప్పారు. ఆసక్తి గల విద్యార్థులు https://forms.gle/jaWLdt2yhNrMpe3eA లో మీ పేరు, విద్యార్హత, ఇతర వివరాలు నమోదు చేయాలని సూచించారు.