News April 7, 2024
KMM: ఈనెల 30 వరకు చెల్లిస్తే 5% శాతం తగ్గింపు

ఖమ్మంలో ఈనెల 30వరకు 5 శాతం రాయితీతో ఇంటి పన్ను చెల్లించే అవకాశం ఉందని మున్సిపాలిటీలోని మీసేవా కేంద్రం వద్ద కానీ, బిల్ కలెక్టర్కు లేదా CDMA.telangana.govt.in ద్వారా ఆన్లైన్ లో చెల్లించవచ్చని కమిషనర్ ఆదర్శ్ సురభి తెలిపారు. షాపింగ్ మాల్స్ ఓనర్లు తప్పనిసరి ట్రేడ్ లైసెన్స్ పొందాలన్నారు. గడువు ముగిసిన వారు రెన్యూవల్ చేయించుకోవాలని సూచించారు.
Similar News
News December 9, 2025
ఖమ్మం: ఎన్నికల వేళ ఇలా చేస్తున్నారా.. జైలుకే..!

ఖమ్మం జిల్లాలో పంచాయతీ ఎన్నికల వేళ, పల్లెల్లో డబ్బు, మద్యం పంపిణీ వంటి ప్రలోభాలు జోరందుకున్నాయి. అయితే ప్రజాస్వామ్యానికి అద్దం పట్టే ఎన్నికల్లో ఇటువంటి చర్యలు నేరమని అధికారులు హెచ్చరిస్తున్నారు. భారతీయ న్యాయ సంహిత (BNS)-2023 ప్రకారం, ఎన్నికల వేళ ప్రలోభాలకు పాల్పడినట్లు ఆధారాలతో సహా నిరూపణ అయితే, తీవ్రమైన శిక్షలతో పాటు జరిమానా తప్పదని స్పష్టం చేశారు.
News December 9, 2025
ఖమ్మం: గ్రానైట్ పరిశ్రమల సమస్యలు పరిశీలించిన కలెక్టర్

ఖమ్మం ఇండస్ట్రియల్ కాలనీలోని గ్రానైట్ యూనిట్లను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సందర్శించి పరిశ్రమల పరిస్థితులను పరిశీలించారు. యాజమాన్యం, కార్మికులతో మాట్లాడుతూ.. విద్యుత్ ఛార్జీలు, ఎగుమతులు, మార్కెట్ డిమాండ్ వంటి సమస్యలను తెలుసుకున్నారు. గ్రానైట్ రంగం వేల కుటుంబాలకు ఆధారం కావడంతో త్వరలో పరిశ్రమలతో సమావేశం నిర్వహించి పరిష్కార చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.