News April 29, 2024

KMM: ఎంపీ అభ్యర్థుల ప్రచారం.. ఓ ‘అగ్గి’ పరీక్షే

image

లోక్ సభ ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామినేషన్ల స్వీకరణ, పరిశీలన ప్రక్రియ పూర్తయింది. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మరోవైపు రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో అభ్యర్థులు, ఆయా పార్టీల శ్రేణులు సతమతమవుతున్నాయి . వారికి ఎండ ఓ సవాలుగా మారింది. రెండు వారాలు మాత్రమే ప్రచారానికి మిగిలి ఉంది. ఎండ తీవ్రతతో ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు.

Similar News

News November 14, 2024

ఖమ్మం: పార్టీ కార్యకర్తలకు మంత్రి తుమ్మల విజ్ఞప్తి

image

ఈనెల 15న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా ఎలాంటి ఆడంబరాల కార్యక్రమాలను నిర్వహించొద్దని, జిల్లాలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయటం, కేక్ కట్టింగ్ లాంటి కార్యక్రమాలు నిర్వహించొద్దని తన అభిమానులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. 40 ఏళ్ల తన రాజకీయ జీవితంలో తెలుగు ప్రజలు తనపై చూపించిన అభిమానంతో జిల్లా సమగ్ర అభివృద్ధితో పాటు రాష్ట్ర అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేశానని తెలిపారు.

News November 13, 2024

ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించిన మంత్రి పొంగులేటి

image

HYDలోని రాజ్ భవన్లో బుధవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రజల నుంచి మంత్రి సమస్యలతో కూడిన ఆర్జీలను స్వీకరించారు. అనంతరం వారి సమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

News November 13, 2024

KMM: ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు

image

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఇందిరమ్మ ప్రభుత్వం పని చేస్తున్నదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఎలాంటి పైరవీలు లేకుండా పార్టీలకు అతీతంగా అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వబోతున్నామని అన్నారు. బుధవారం గాంధీ భవన్‌లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో మంత్రి పొంగులేటి పాల్గొన్నారు. అనంతరం ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని అన్నారు.