News March 15, 2025

KMM: ఏడాదిలో 16మంది ఏసీబీకి చిక్కారు..!

image

ఉమ్మడి ఖమ్మంలో అవినీతి అధికారులు పెరిగిపోతున్నారు. ఏడాదిలో దాదాపు 16 మంది అధికారులు ఏసీబీ అధికారులకు పట్టబడ్డారు. రూ.లక్షల్లో జీతాలు తీసుకుంటున్నా, ఆఖరికి రూ.1500కు కూడా కక్కుర్తి పడి ఏసీబీకి చిక్కుతున్నారు. ఇంకా గుట్టుచప్పుడు కాకుండా ఎంత నడుస్తోందోనని జిల్లావాసులు చర్చించుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు లంచం విషయంలో ఇబ్బంది పెడితే తమను సంప్రదించాలని ఖమ్మం ఏసీబీ డీఎస్పీ రమేశ్ సూచిస్తున్నారు.

Similar News

News February 9, 2026

ఎర్రగుంట్ల: కన్న తల్లిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కొడుకు

image

ఎర్రగుంట్ల(M) పోట్లదుర్తిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జాకోబ్(60) తన తల్లి సుందరమ్మ(90)పై ఆదివారం పెట్రోల్ పోసి నిప్పంటించాడు. బంధువులు వెంటనే ఆమెను ప్రొద్దుటూరుకు, ఆపై RIMSకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందింది. దీనిపై కేసు నమోదు చేసినట్లు CI విశ్వనాథరెడ్డి తెలిపారు. జాకోబ్ తన కూతురు లత వద్ద రూ.18 లక్షలు తీసుకున్నాడు. ఈ అప్పును తీర్చమన్నందుకే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు CI చెప్పారు.

News February 9, 2026

సిద్దిపేట: మహాసభ విజయవంతం చేయాలి: BDSF

image

ఫిబ్రవరి 27, 28న సిద్దిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగే బహుజన డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ (BDSF) 3వ జిల్లా మహాసభను విజయవంతం చేయాలని BDSF రాష్ట్ర ఉపాధ్యక్షుడు దబ్బెట ఆనంద్ కోరారు. సోమవారం మహాసభ కరపత్రాలను ఆవిష్కరించారు. రాష్ట్రంలోని అనేక సమస్యలపై మహాసభలో చర్చించి పోరాటానికి తీర్మానాలు చేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం విద్యాశాఖకు మంత్రిని కేటాయించకపోవడం బాధాకరమన్నారు.

News February 9, 2026

హైదరాబాద్‌: తిండి కంటే ఫొటోలకే క్రేజ్‌!

image

హైదరాబాద్‌ పోరగాళ్లది మామూలు రచ్చ కాదు. ఇప్పుడు తిండి రుచి కంటే కూడా అది కెమెరాలో ఎట్లా కనిపిస్తుందనేదే ముఖ్యం. నియాన్ లైట్ల కొరియన్ ఫుడ్ దగ్గర మొదలుపెట్టి, మంటలు పుట్టించే ఫైర్ నూడుల్స్ దాకా అన్నీ రీల్స్ కోసమే. ప్లేటులో చీజ్ ఊగినా, పొగలు కక్కినా అదో వైరల్ సెన్సేషన్. కడుపు నిండడం సంగతేమో కానీ వీడియో క్రేజీగా రాకపోతే వీళ్లకు ఆ క్యాలరీలు దండగన్నమాట. డ్రామా ఉంటేనే మన జెన్-జీకి అసలైన దావత్.