News May 19, 2024
KMM: ఐటీఐ ప్రవేశాలకు వేళాయె..!
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఐటీఐ కళాశాలల్లో ప్రవేశాలకు అధికారులు చర్యలు ప్రారంభించారు. 2024-25 విద్యా సంవత్సరం ప్రవేశాలకు జూన్ 10వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ కళాశాలల్లో 5,477 సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. పదో తరగతి, ఎనిమిదో తరగతి ఉత్తీర్ణులై 2024, ఆగస్టు 1వ తేదీ నాటికి 14 ఏళ్లు నిండినవారు అర్హులని తెలిపారు.
Similar News
News December 6, 2024
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ను సందర్శించిన మంత్రి తుమ్మల
నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ రెవెన్యూ డివిజన్‌లోని దామరచర్లలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ను మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ రావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం సందర్శించారు. పవర్ ప్లాంట్‌ను అభివృద్ధి చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని వారు తెలిపారు.
News December 6, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు
∆} ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజా విజయోత్సవ కార్యక్రమాలు ∆} పలు శాఖల అధికారులతో భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} తల్లాడలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన ∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} ఇల్లెందులో ఎమ్మెల్యే కోరం కనకయ్య పర్యటన ∆} మణుగూరులో మంచి నీటి సరఫరా బంద్ ∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు
News December 6, 2024
రాత్రి ఖమ్మంలో రోడ్డు ప్రమాదం UPDATE
ఖమ్మంలో నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో <<14801070>>ఇద్దరు <<>>చనిపోయిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాల ప్రకారం.. తిరుమలాయపాలెం మండలం పడమటితండాకు చెందిన శివరాజు(18), హర్షవర్ధన్(15) ఉదయం బైక్‌పై ఖమ్మం వచ్చారు. తిరుగు ప్రయాణంలో వీరి బైక్‌ను RTC బస్సు ఢీకొంది. ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.