News June 20, 2024

KMM: ఒక్కసారిగా కుప్పకూలిన మిర్చి ధరలు

image

ఖమ్మం జిల్లాలో మిర్చి ధరలు పతనమయ్యాయి. గత ఏడాది మేలో క్వింటాల్ మిర్చి కనీస ధర రూ.9 వేలు, గరిష్ట ధర రూ.26,500 పలికాయి. ఈ ఏడాది ధరలు తగ్గడంతో క్వింటాల్ కనీస ధర రూ.8 వేలు, గరిష్ఠ ధర 20,700కి పడిపోయింది. తేజ రకానికి చెందిన మిర్చి మాత్రమే క్వింటాల్ రూ.19,500 ధర పలుకుతోంది. మిగిలిన అన్నిరకాల మిర్చి ధరలు గణనీయంగా తగ్గాయి. ఎగుమతులు ప్రారంభంకాకపోవడంతో కోల్డ్ స్టోరేజీల్లో మిర్చి నిల్వలు పేరుకుపోతున్నాయి.

Similar News

News November 29, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈరోజు ముఖ్య అంశాలు

image

∆} ఖమ్మం:రైతుకు ఏది మేలు అయితే అదే అమలు చేస్తాం: తుమ్మల∆} ఖమ్మం జిల్లా కలెక్టర్‌ను కలిసిన సత్తుపల్లి ఎమ్మెల్యే∆}కొత్తగూడెం: కోచింగ్ లేకుండానే మూడు ఉద్యోగాలు∆} వైరా:భర్తపై భార్య కత్తితో దాడి∆} మధిర: షిఫ్ట్ కారులో వచ్చి పలు ఇండ్లలో దొంగతనాలు∆} మణుగూరు: జర్నలిస్టులపై కేసు కొట్టివేత∆}వెంకటాపురం:ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి మృతి

News November 29, 2024

మంత్రి తుమ్మల వ్యాఖ్యలపై మీ కామెంట్..?

image

రైతు బంధుపై మంత్రి తుమ్మల ‘మహబూబ్ నగర్‌ రైతు పండుగ’ సభలో ఈరోజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘రైతుబంధు కంటే సన్నవడ్లకు క్వింటాకు రూ.500 బోనస్ బాగుందని రైతులు అంటున్నారు’ అని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారన్నారు. తాము రైతులకు కల్లబొల్లి కబుర్లు చెబుతూ పల్లకీలో ఊరేగించబోమని, ప్రభుత్వం తరఫున చేయాల్సినంత చేస్తామన్నారు. మంత్రి వ్యాఖ్యలపై మీ కామెంట్ తెలపండి.

News November 29, 2024

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటాలు ఏసీ మిర్చి ధర రూ.16,325 జెండా పాట పలకగా, క్వింటాలు పత్తి ధర రూ.7,200 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటి కంటే ఈరోజు ఏసీ మిర్చి ధర రూ.75 తగ్గగా, పత్తి ధర మాత్రం రూ.50 పెరిగినట్లు వ్యాపారస్తులు తెలిపారు. మార్కెట్‌కు వచ్చే రైతులు నిబంధనలు పాటిస్తూ క్రయవిక్రయాలు జరుపుకోవాలని సూచించారు.