News April 16, 2025
KMM: కోచ్ నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

ఖమ్మం జిల్లా లోని మధిర, వైరా, కల్లూరు మినీ స్టేడియాల్లో క్రీడా కారులకు శిక్షణ ఇచ్చేందుకు గాను కోచ్‌ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువ జన, క్రీడల శాఖ అధికారి సునిల్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల ఎన్ఐఎస్ శిక్షణ పొంది సర్టిఫికెట్ ఉన్న వారు, సీనియర్ క్రీడాకారులు ఈనెల 22 కల్లా తమ దరఖాస్తులను సర్దార్ పటేల్ స్టేడియంలోని కార్యాలయంలో అందజేయాలని కోరారు.
Similar News
News December 16, 2025
ఖమ్మం: 18 నుంచి 22 వరకు రేషన్ బియ్యం

ఈ నెల 18 నుంచి 22 వరకు రేషన్ షాపులలో బియ్యం లభ్యత ఉంటుందని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డి తెలిపారు. పోర్టబిలిటీ బియ్యం కోసం జిల్లాకు 446.282 మెట్రిక్ టన్నులు కేటాయించడం జరిగిందన్నారు. ఈ బియ్యాన్ని రేషన్ దుకాణాలకు సరఫరా చేశామని, రేషన్ లబ్ధిదారులు ఈ తేదీల్లో వారికి సమీపంలో గల దుకాణాల నుంచి పోర్టబిలిటీ ద్వారా బియ్యం పొందాలని ఆయన కోరారు.
News December 16, 2025
మూడో విడత పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

ఖమ్మం జిల్లాలో రేపు జరగనున్న మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. సింగరేణిలోని ఎన్నికల సామగ్రి పంపిణీ, స్వీకరణ కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. పోలింగ్ ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 వరకు, కౌంటింగ్ 2 గంటల నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. సమస్యాత్మక కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్, సీసీ కెమెరాలతో పర్యవేక్షణ, పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.
News December 16, 2025
ఖమ్మం జిల్లాలో పరిశ్రమల విస్తరణకు చర్యలు: కలెక్టర్

రఘునాథపాలెం మండలం జింకల తండా, పువ్వాడ నగర్ పరిధిలో టీజీఐఐసీకి కేటాయించిన భూములను మంగళవారం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలత, రహదారి అనుసంధానం, మౌళిక వసతుల లభ్యతపై అధికారులతో చర్చించారు. భూముల సరిహద్దులను మ్యాప్‌ల ఆధారంగా సర్వే చేసి కేటాయించాలని ఆదేశించారు. ఖమ్మం జిల్లాను పరిశ్రమల హబ్‌గా అభివృద్ధి చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు.


