News January 24, 2025
KMM: క్రీడలు మానసికోల్లాసానికి దోహదం: అడిషనల్ డీసీపీ

క్రీడలు మానసిక, శారీరక ఉల్లాసానికి దోహదం చేస్తాయని అడిషనల్ డీసీపీ నరేష్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు పుట్టకోట రోడ్డులోని శ్రీచైతన్య స్కూల్‌లో శుక్రవారం ఉడాన్ క్రీడల ప్రారంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అనారోగ్య సమస్యలు క్రీడలతో దరిచేరవని విద్యాసంస్థల ఛైర్మన్ మల్లెంపాటి శ్రీధర్ చెప్పారు. కార్యక్రమంలో జిల్లా క్రీడల అధికారి సునీల్ రెడ్డి, సైదుబాబు, టెన్నిస్ కోచ్ నాగరాజు పాల్గొన్నారు.
Similar News
News February 13, 2025
మున్సిపాలిటీలకు టెన్షన్‌గా పన్ను వసూళ్లు

ఖమ్మం జిల్లాలోని మున్సిపాలిటీలకు పన్ను వసూళ్లు టెన్షన్‌గా మారింది. ఖమ్మం కార్పొరేషన్, సత్తుపల్లి, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు, మధిర మున్సిపాలిటీల్లో 50% పైగా ఆస్తి పన్నులు వసూళ్లయ్యాయి. వైరా మున్సిపాలిటీలో కేవలం 27 శాతమే వసూళ్లయ్యాయి. ఇటీవల జరిగిన సమీక్షలో లక్ష్యానికి దూరంగా మున్సిపల్ సిబ్బందిపై ఉన్నతాధికారులు సీరియస్ అయినట్టు తెలుస్తోంది. వసూళ్లలో వేగం పెంచాలని ఆదేశించినట్టు సమాచారం.
News February 13, 2025
కూసుమంచి: కల్లులో పురుగు మందు కలిపాడు..!

కల్లు అమ్మకంలో వచ్చిన విభేదాలతో ఓ గీత కార్మికుడు మరోగీత కార్మికుడి కల్లుకుండలో పురుగు మందు కలిపిన ఘటన కూసుమంచి మండలంలో వెలుగు చూసింది. మొక్క వీరబాబుకు ఐతగాని రమేష్‌కు మధ్య విభేదాలు ఉన్నాయి. దీనిని మనసులో పెట్టుకున్న రమేష్, వీరబాబుకి చెందిన కల్లు కుండలో విషం కలిపాడు. చెట్టు ఎక్కగా వాసన రావడంతో అనుమానం వచ్చిన వీరబాబు, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారించగా రమేష్ అంగీకరించడంతో కేసు నమోదు చేశారు.
News February 13, 2025
ఖమ్మం జిల్లాలో రెచ్చిపోతున్న దొంగలు

ఖమ్మం జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. వైరా సుందరయ్య నగర్‌లో పట్టపగలే భారీ చోరి జరిగింది. ఓ వద్ధురాలి ఇంట్లో చోరబడిన దొంగలు ఆమెపై దాడి చేయడంతో పాటు ఆమె కాళ్లు, చేతులను కట్టేసి, నోటికి ప్లాస్టర్ వేసి చోరీకి పాల్పడ్డారు. పక్కా ప్రణాళిక ప్రకారమే ఈ చోరీ జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.