News February 4, 2025

KMM: గిరిజన నిరుద్యోగ యువకులకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఖమ్మం జిల్లాలోని గిరిజన నిరుద్యోగ యువతీ యువకులు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసిన నోటిఫికేషన్ గ్రూప్-డి (32,000) పోస్టులకు ఈనెల 22లోగా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ఉప సంచాలకులు, గిరిజన సంక్షేమ శాఖ తెలిపారు. గిరిజన నిరుద్యోగ యువతకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. పూర్తి వివరాలకు 7729961197 నంబర్‌ను సంప్రదించాలని చెప్పారు.

Similar News

News December 12, 2025

KMM: తొలివిడతలో సత్తా చాటిన కాంగ్రెస్ అభ్యర్థులు

image

ఖమ్మం జిల్లాలో జరిగిన తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు సత్తా చాటారు. తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో (7 మండలాల్లో) కాంగ్రెస్ పార్టీ-136, బీఆర్ఎస్-34, సీపీఐ-6, సీపీఎం-10, టీడీపీ-2, ఇండిపెండెంట్-4 స్థానాల్లో విజయం సాధించారు. అధికంగా వైరా మండలంలో మొత్తం 22 గ్రామ పంచాయితీల్లో 20 స్థానాల్లో కాంగ్రెస్, సీపీఎం-1, బీఆర్ఎస్- 1 స్థానాల్లో నిలిచారు.

News December 12, 2025

ఖమ్మం జిల్లాలో FINAL పోలింగ్ శాతం

image

ఖమ్మం జిల్లాలో 192 పంచాయతీల్లో గురువారం మొదటి విడత ఎన్నికలు జరిగాయి. కాగా మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ ముగియగా సమయానికి కేంద్రంలోపలికి వచ్చి క్యూలైన్‌లో నిలబడిన వారందరికీ ఓటేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. దీంతో జిల్లాలో ఫైనల్‌గా 90.08 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు ప్రకటించారు.

News December 12, 2025

H.I.V వ్యాక్సిన్ పట్ల సంపూర్ణ అవగాహన కల్పించాలి: జిల్లా కలెక్టర్

image

ఖమ్మం: హెచ్.పి.వి. వ్యాక్సిన్ పట్ల ప్రజలలో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ఖమ్మం జడ్పి కార్యాలయంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన హెచ్.పి.వి. వ్యాక్సినేషన్ శిక్షణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. 14 సంవత్సరాల వయస్సు గల బాలికల్లో సర్వైకల్ క్యాన్సర్ నివారించడానికి బాలికలకు ఆరోగ్య భద్రత కల్పించాల్సిన అవసరం వుందని పేర్కొన్నారు.