News July 25, 2024
KMM: గురుకులాల్లో ప్రవేశాలకు స్పాట్ కౌన్సెలింగ్

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ప్రవేశాల కోసం ఈనెల 26, 27వ తేదీల్లో స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరం జనరల్ గ్రూప్లతో పాటు ఒకేషనల్ గ్రూప్లో మిగిలిన సీట్ల భర్తీకి కోసం ప్రభుత్వం అవకాశం కల్పించిందని పేర్కొన్నారు. బాలికలకు 26వ తేదీన టేకులపల్లి గురుకులంలో, బాలురకు 27వ తేదీన తిరుమలయపాలెంలో కౌన్సెలింగ్ ఉంటుందన్నారు.
Similar News
News January 7, 2026
ఖమ్మం జిల్లాలో యూరియా UPDATE..

యూరియా పంపిణీ పై రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని కలెక్టర్ అనుదీప్ సూచించారు. జిల్లాలో బుధవారం వరకు 10,345 మెట్రిక్ టన్నుల యూరియా స్టాక్ అందుబాటులో ఉందని వెల్లడించారు. అటు 100 ప్రైవేట్ షాపుల్లో 525.70 మెట్రిక్ టన్నులు, 83 పీఏసీఎస్ కేంద్రాల్లో 1169.10 మెట్రిక్ టన్నులు యూరియా అందుబాటులో ఉందన్నారు. ఇప్పటివరకు 28,128 మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు పంపిణీ చేశామన్నారు.
News January 7, 2026
ఖమ్మం: సీఎం సమక్షంలో మరో ముగ్గురు కార్పొరేటర్ల చేరిక

ఖమ్మంలో బీఆర్ఎస్ ముగ్గురు కార్పొరేటర్లు కాంగ్రెస్‌లో చేరారు. హైద్రాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి వీరికి పార్టీ కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. మంత్రి తుమ్మల ఆధ్వర్యంలో వీరి చేరిక జరిగింది. ఇటీవల కాలంలో ఐదుగురు చేరగా.. ఇప్పుడు ముగ్గురు కార్పొరేటర్లు చేరారు. దీంతో 40 మంది కార్పొరేటర్లతో ఖమ్మం కార్పొరేషన్‌లో కాంగ్రెస్ బలంగా మారింది.
News January 7, 2026
ఖమ్మం: రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక

సంక్రాంతి రద్దీ దృష్ట్యా ఖమ్మం మీదుగా నడిచే పలు రైళ్ల రాకపోకల్లో మార్పులు చేసినట్లు సీసీటీఓ రాజగోపాల్ తెలిపారు. నేటి నుంచి ఈనెల 20 వరకు సింహపురి, గౌతమి, పద్మావతి తదితర రైళ్లు సికింద్రాబాద్ వరకు కాకుండా చర్లపల్లి స్టేషన్ వరకే నడుస్తాయని స్పష్టం చేశారు. తిరిగి ఆయా రైళ్లు చర్లపల్లి నుంచే ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. ప్రయాణికులు ఈ మార్పును గమనించి సహకరించాలని ఆయన కోరారు.


