News May 25, 2024
KMM: చివరి దశకు ఎమ్మెల్సీ ఎన్నిక ప్రచారం

WGL-KMM-NLG పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. పోలింగ్ ఈనెల 27న పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 4,61,806 మంది ఓటర్లున్నారు. ఏడుగురు మంత్రులు ఈ నియోజకవర్గంలో ఉండగా.. కాంగ్రెస్ ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. సిటింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని బీఆర్ఎస్ చూస్తుండగా.. బీజేపీ ఈ స్థానంలో బోణీ కొట్టాలని చూస్తోంది.
Similar News
News February 20, 2025
మండలానికో నమూనా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం:కలెక్టర్

ఖమ్మం : ఇందిరమ్మ ఇంటి నిర్మాణం ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా మండలానికో నమూనా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం ఖమ్మం రూరల్ మండలం తరుణిహాట్ ఆవరణలో ఉన్న ఖాళీ స్థలంలో ఇందిరమ్మ ఇండ్ల నమూనా ఇల్లు నిర్మించే స్థలాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
News February 19, 2025
ఖమ్మం: వడదెబ్బపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలి:కలెక్టర్

ఖమ్మం: వడదెబ్బ బారిన పడకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృత ప్రచారం కల్పించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం వడగాల్పుల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యశాఖ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని, గత సంవత్సరం దాదాపు 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని కలెక్టర్ తెలిపారు.
News February 19, 2025
ఖమ్మం జిల్లా TOP NEWS

✓ఖమ్మం జిల్లాలో విషాదం.. రైతు ఆత్మహత్య✓జిల్లా వ్యాప్తంగా ఘనంగా చత్రపతి శివాజీ జయంతి వేడుకలు✓ఖమ్మం: బెట్టింగ్ భూతానికి యువకుడు బలి✓ తిరుమలాయపాలెంలో ఎరువులు కొరత✓పెనుబల్లి:వ్యక్తిని ఢీకొట్టిన టీవీఎస్.. ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి✓ పెరుగుతున్న ఎండలు.. కలెక్టర్ రివ్యూ ✓ఖమ్మం: ముగ్గురు మంత్రులు ఉండి రైతులను పట్టించుకోరా:MLC ✓ఏన్కూర్ మండల ప్రజలకు GOODNEWS✓ పంటల రక్షణకు సోలార్ ఫెన్సింగ్: మంత్రి తుమ్మల