News January 25, 2025

KMM: జులై లోపు మున్నేరు రిటైనింగ్ వాల్ పూర్తి: కలెక్టర్

image

మున్నేరు నదికి ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మించేందుకు అవసరమైన భూ సేకరణ, నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. శుక్రవారం రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో కలిసి మున్నేరు రిటైనింగ్ వాల్ కోసం భూసేకరణ పురోగతి, జరుగుతున్న రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులను పరిశీలించారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని జులై లోపు తప్పనిసరిగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

Similar News

News December 6, 2025

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు

image

బాబ్రీ మసీదు కూల్చివేత రోజు (డిసెంబర్ 6) సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. సీపీ సునీల్ దత్ ఆదేశాల మేరకు అడిషనల్ డీసీపీ ప్రసాద్ రావు ఆధ్వర్యంలో పోలీసులు ముందస్తు తనిఖీలు చేపట్టారు. ప్రజలు వదంతులు నమ్మవద్దని అధికారులు సూచించారు. అనుమానిత వ్యక్తులు, సామాజిక మాధ్యమాల్లో పుకార్లు వ్యాప్తి చేసే వారిపై నిఘా ఉంచినట్లు తెలిపారు.

News December 6, 2025

మూడో విడత ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల స్వీకరణ

image

ఖమ్మం జిల్లాలో మూడో విడత ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. 7 మండలాల్లోని 191 గ్రామ పంచాయితీలకు గాను మొత్తం 1025 మంది సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేశారు. ఏన్కూరు S-109, కల్లూరు S-124, పెనుబల్లి S-158, సత్తుపల్లి S-106, సింగరేణి S-157, తల్లాడ S-145, వేంసూరు 126 మంది సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు వేశారు. కాగా నేటి నుంచి నామినేషన్ల పరిశీలన ప్రక్రియ జరగనుంది.

News December 6, 2025

పాలేరు జలాశయంలో మత్స్యకారుడు మృతి

image

కూసుమంచి మండలం పాలేరు జలాశయంలో చేపల వేటకు వెళ్లి ఎర్రగడ్డ తండాకు చెందిన బానోత్ వాల్య(65)అనే మత్స్యకారుడు మృతి చెందాడు. తండావాసుల కథనం ప్రకారం.. శుక్రవారం సాయంత్రం చేపల వేటకు వెళ్లిన వాల్యకు చేపల వలలు కాళ్లకు చుట్టుకుని నీటిలో మునిగి పోయాడు. ఈరోజు ఉదయం గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు.