News January 25, 2025

KMM: జులై లోపు మున్నేరు రిటైనింగ్ వాల్ పూర్తి: కలెక్టర్

image

మున్నేరు నదికి ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మించేందుకు అవసరమైన భూ సేకరణ, నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. శుక్రవారం రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో కలిసి మున్నేరు రిటైనింగ్ వాల్ కోసం భూసేకరణ పురోగతి, జరుగుతున్న రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులను పరిశీలించారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని జులై లోపు తప్పనిసరిగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

Similar News

News February 13, 2025

ఖమ్మం జిల్లాలో నేడు మంత్రి పొంగులేటి పర్యటన

image

ఖమ్మం జిల్లాలో నేడు (గురువారం) మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించనున్నట్లు మంత్రి  కార్యాలయ ఇన్ఛార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. నేలకొండపల్లి, కూసుమంచి, ఖమ్మం నగరం, కొణిజర్ల మండలాల్లో పర్యటించి పలు భాదిత కుటుంబాలను పరామర్శిస్తారని అన్నారు. అనంతరం పలు ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గమనించాలని పేర్కొన్నారు.

News February 13, 2025

మైనారిటీ గురుకులాల్లో ప్రవేశానికి అడ్మిషన్లు

image

తెలంగాణ మైనారిటీస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏడు మైనారిటీస్ గురుకుల పాఠశాల, కళాశాలలో 2025 -26 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు కోరుతున్నట్లు జిల్లా మైనారిటీ శాఖ జిల్లా అధికారి సత్యనారాయణ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 28వ తేదీ వరకు అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు.  విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

News February 12, 2025

ఏపీ కోళ్లను అనుమతించొద్దు: అడిషనల్ ఎస్పీ

image

ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ముదిగొండ మండలం వల్లభి చెక్ పోస్ట్ వద్ద వచ్చే కోళ్ల వాహనాలను అనుమతించొద్దని అడిషనల్ ఎస్పీ ప్రసాద్ రావు తెలిపారు. సీఐ మురళి, తహశీల్దార్ సునీత ఎలిజబెత్, పశు వైద్యాధికారులు అశోక్, రమేష్ బాబు, వైద్య అధికారి ధర్మేంద్ర, ఆర్ఐ ప్రసన్నకుమార్‌తో కలిసి వల్లభి చెక్ పోస్టు వద్ద ఆయన తనిఖీలు చేశారు. ఏపీ నుంచి వచ్చే కోళ్లను, ఇసుకను అనుమతించొద్దని సిబ్బందికి పలు సూచనలు చేశారు.

error: Content is protected !!