News November 29, 2024
KMM: డ్రగ్స్ నియంత్రణకై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి: కలెక్టర్
జిల్లాలో మాదకద్రవ్యాలు, డ్రగ్స్ నియంత్రణ ప్రాధాన్యత అంశంగా అధికారులు పని చేయాలని, ఈ దిశగా అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ డా.పి.శ్రీజతో కలిసి కలెక్టరేట్ లోని తన ఛాంబర్‌లో మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ నియంత్రణపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.
Similar News
News December 8, 2024
మధ్యాహ్న భోజనం నాణ్యతను పెంచాలి: డీఈఓ
మధ్యాహ్న భోజనం నాణ్యతను పెంచాలని, విద్యార్థుల ఆరోగ్యం పెంపొందటానికి పుష్టికరమైన ఆహారం చాలా అవసరమని జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర్ శర్మ అన్నారు. ఖమ్మంలోని అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్లో ఆదివారం నిర్వహించిన మధ్యాహ్న భోజన కుక్ కం హెల్పర్ల జిల్లా స్థాయి వంటలు పోటీలను ఆయన ప్రారంభించారు. పలు స్కూల్స్ కి చెందిన కుక్‌లు పాల్గొన్నారు.
News December 8, 2024
నార్వారిగూడెం వద్ద రోడ్డుప్రమాదం.. ఇద్దరు మృతి
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన ఘటన అశ్వారావుపేట మండలంలో ఆదివారం ఉదయం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్వారిగూడెం సమీపంలోని కోళ్ల ఫారం వద్ద లారీ-బైక్ ఢీకొన్న ఘటనలో బైక్‌పై వెళుతున్న ఇద్దరు చనిపోయారు. మరొకరికి గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని అశ్వారావుపేట అస్పత్రికి తరలించారు.
News December 8, 2024
అశ్వారావుపేటలో ఇంటర్ విద్యార్థిని సూసైడ్
తల్లి మందలించడంతో కూతురు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శనివారం అశ్వారావుపేటలో జరిగింది. ఎస్ఐ యయాతి రాజు కథనం ప్రకారం.. మండల కేంద్రంలోని దండాబత్తుల బజార్‌కు చెందిన సామినేని వెంకన్న, వరలక్ష్మీ దంపతుల కుమార్తె జశ్విత సాయి(17) ఇంటర్ చదువుతోంది. ఉదయం లంచ్ బాక్స్ సర్దుకునే విషయంలో తల్లీ, కూతురికి గొడవ జరిగింది. దీంతో క్షణికావేశంలో విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.