News September 23, 2024

KMM: తిరుమల లడ్డూ ప్రసాదంలో పొగాకు ప్యాకెట్

image

తిరుమల లడ్డూ కల్తీపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మరోసారి అపవిత్రమైందంటూ ఖమ్మంలో జరిగిన ఘటన హాట్ టాపిక్‌గా మారింది. గొల్లగూడెం శివారులో కార్తికేయ టౌన్ షిప్‌కు చెందిన దొంతు పద్మావతి 19న తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి వచ్చింది. ప్రసాదాన్ని వారి బంధువులకు, ఇరుగు పోరుగు వాళ్లకు పంచేందుకు చూడగా పొగాకు వంటి పదార్థం కనిపించిందని ఆరోపించారు. ఆ దృశ్యాలు ఇప్పుడు స్థానిక మధ్యమాల్లో వైరల్ అయ్యాయి.

Similar News

News January 9, 2026

46 మంది ఉపాధ్యాయుల సర్దుబాటు: డీఈవో

image

ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధనకు ఆటంకం కలగకుండా విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పదవీ విరమణ, సెలవుల వల్ల ఏర్పడిన ఖాళీల్లో 46 మంది ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తూ డీఈవో చైతన్యజైనీ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. నవంబర్, డిసెంబర్ నెలల ఖాళీలతో పాటు సెక్టోరల్ విభాగాల్లోని ఏఎంవో, జీసీడీవో స్థానాల్లోనూ నియామకాలు చేపట్టారు.

News January 9, 2026

ఖమ్మం: రోడ్డు ప్రమాదం.. విద్యుత్ శాఖ ఇంజినీర్ మృతి

image

ఖమ్మంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో చింతకాని విద్యుత్ శాఖ సబ్ ఇంజినీర్ పి. సందీప్ రెడ్డి మృతి చెందారు. విధి నిర్వహణ ముగించుకుని బైక్‌పై ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సందీప్ రెడ్డి మృతితో ఆయన కుటుంబంలో, విద్యుత్ శాఖలో తీవ్ర విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.

News January 9, 2026

సత్తుపల్లి జిల్లా ఆశలు.. మంత్రి పొంగులేటిపైనే..!

image

1997లో మొదలైన సత్తుపల్లి జిల్లా ఉద్యమం ప్రస్తుతం తుది దశకు చేరుకుంది. నాటి ఉద్యమ సారథి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేడు రాష్ట్ర మంత్రిగా ఉండటంతో జిల్లా ఏర్పాటుపై ప్రజల్లో ఆశలు చిగురించాయి. నాడు జిల్లా ఆవశ్యకతపై ముఖ్యమంత్రికి లేఖ రాసిన ఆయన, ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేగవంతం చేస్తున్నారు. ప్రియాంకా గాంధీ ఇచ్చిన హామీ నేపథ్యంలో ఈ ‘తీపి కబురు’ ఎప్పుడు వింటామా స్థానికులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.