News August 20, 2024
KMM: త్వరలో ‘ధరణి’ సమస్యలకు చరమగీతం: మంత్రి పొంగులేటి

గత బీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రపూరితంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్ వల్ల తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్న కష్టాలు, బాధలకు త్వరలోనే చరమగీతం పాడబోతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. దేశానికే ఆదర్శంగా ఉండేలా నూతన రెవెన్యూ చట్టం తీసుకొస్తామని చెప్పారు. ‘రెవెన్యూ’ను కంటికి రెప్పలా కాపాడుకుంటామని వివరించారు. చట్టాలు సరిగా లేకపోతే ఫలితాలు ఎలా ఉంటాయో గత ప్రభుత్వంలోనే తెలిసిందని పేర్కొన్నారు.
Similar News
News November 20, 2025
రేగళ్లపాడు సెక్రటరీని సస్పెండ్ చేసిన కలెక్టర్

ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల మంజూరుకు లంచం డిమాండ్ చేసిన పంచాయతీ కార్యదర్శి శివమాధవరావు సస్పెండయ్యారు. సత్తుపల్లి(M) రేగళ్లపాడులో లబ్ధిదారులు ఎడుకొండలు, సీతకు బిల్లులు చెల్లించేందుకు కార్యదర్శి ఈ నెల 4న రూ. 10 వేలు డిమాండ్ చేశారు. బాధితులు టోల్ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయగా, హౌసింగ్ ఈఈ శ్రీనివాస్ విచారణ చేపట్టారు. ఈఈ నివేదిక ఆధారంగా కలెక్టర్ కార్యదర్శిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
News November 20, 2025
ఖమ్మం: గంజాయి కేసు.. ఇద్దరికి 20 ఏళ్ల జైలు శిక్ష

గంజాయి కేసులో పట్టుబడిన ఇద్దరు నిందితులకు ఖమ్మం మొదటి అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి కె. ఉమాదేవి బుధవారం సంచలన తీర్పు చెప్పారు. ఇద్దరికి 20 ఏళ్ల జైలు శిక్ష, ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున జరిమానా విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. తీర్పు అనంతరం ప్రాసిక్యూషన్కు సహకరించిన అధికారులను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ప్రత్యేకంగా అభినందించారు.
News November 20, 2025
ధాన్యం, పత్తి కొనుగోళ్లపై మంత్రి తుమ్మల సమీక్ష

ధాన్యం, పత్తి పంటల కొనుగోళ్లపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి సమీక్ష నిర్వహించారు. నాణ్యత పరిశీలించిన ధాన్యానికి రైస్ మిల్లుల వద్ద కోతలు విధించవద్దని అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలులో పాటిస్తున్న విధానాన్నే పత్తి కొనుగోలుకు కూడా పాటించాలన్నారు. గ్రామాల్లోనే తేమ శాతం చూడాలని సూచించారు.


