News October 1, 2024
KMM: దసరా పండుగకు 724 ప్రత్యేక బస్సులు
దసరా పండుగ సందర్భంగా TGSRTC సుమారుగా 724 బస్సులను ప్రత్యేకంగా నడపనున్నట్లు ఉమ్మడి ఖమ్మం జిల్లా రీజనల్ మేనేజర్ సరిరామ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఖమ్మం – హైదరాబాద్ మార్గంలో నాన్ స్టాప్ షటిల్ సర్వీసులు నడపబడునని తెలిపారు. ఈనెల 9 నుంచి 11 వరకు హైదరాబాద్ – ఖమ్మం 13, 14 తేదీలలో ఖమ్మం – హైదరాబాద్‌కు నిత్యం తిరిగే 154 బస్సులతో పాటు అదనంగా 100 బస్సులను నడపనున్నట్లు తెలిపారు.
Similar News
News October 4, 2024
ఖమ్మం: ప్రతి హాస్టల్ విద్యార్ధులతో ఫుడ్ కమిటీ ఏర్పాటు: కలెక్టర్
ఖమ్మం జిల్లాలోని రెసిడెన్షియల్ పాఠశాలలు, సంక్షేమ హాస్టల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. గురువారం జిల్లాలో ఉన్న గురుకులాలు, సంక్షేమ హాస్టళ్ళ నిర్వహణపై అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ప్రతి హాస్టల్లో విద్యార్థులతో ఫుడ్ కమిటీ ఏర్పాటు చేయాలని, ఆహార పదార్థాల డెలివరీ, స్టోరేజిలో వీరిని భాగస్వామ్యం చేయాలన్నారు.
News October 3, 2024
ఖమ్మం: డయల్-100కు ఎన్ని కాల్స్ వచ్చాయంటే.?
సమాజంలో పెరిగిపోతున్న నేర ప్రవృత్తి నేపథ్యంలో ప్రజల ధన, మాన, ప్రాణాల రక్షణే ధ్యేయంగా ఏర్పాటైన డయల్-100కు పోలీస్ కమిషనరేట్ పరిధిలో 5,511 కాల్స్ వచ్చినట్లు CP సునీల్ దత్ తెలిపారు. వీటిపై 81 FIRలు నమోదు చేశామని, వీటిలో మహిళలపై వేధింపులు-2, దొంగతనాలు-9, సాధారణ ఘాతాలు-26, యాక్సిడెంట్లు-11, అనుమానాస్పద మరణాలు-10, ఇతర కేసులు-23 అన్నారు. ఫేక్ కాల్స్ చేయవద్దని, అత్యవసర సమయంలో మాత్రమే ఫోన్ చేయాలన్నారు.
News October 3, 2024
కొత్తగూడెం: ధ్రువపత్రాల పరిశీలన పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్
డీఎస్సీ-2024 అభ్యర్థుల ద్రువపత్రాల పరిశీలన సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. స్థానిక సింగరేణి ఉన్నత పాఠశాలలో డీఎస్సీ 2024 కు 1:3 నిష్పత్తిలో ఎన్నికైన అభ్యర్థుల ద్రువపత్రాల పరిశీలన సరళిని కలెక్టర్ పరిశీలించారు. అభ్యర్థులకు ఎటువంటి సందేహాలు ఉన్న తక్షణమే నివృత్తి చేస్తూ సానుకూల వాతావరణంలో పరిశీలన పూర్తి చేయాలని అధికారులను సూచించారు.