News November 30, 2024
KMM: దారుణం.. డబ్బులిచ్చినా సాయితేజను చంపేశారు..!
అమెరికాలో దుండగుల కాల్పుల్లో ఖమ్మం రాపర్తినగర్‌కు చెందిన <<14749255>>యువకుడు సాయితేజ<<>> చనిపోయిన విషయం తెలిసిందే. MS చదివేందుకు చికాగో వెళ్లిన సాయితేజ అక్కడే పార్ట్ టైం జాబ్ చేస్తూ చదువుకుంటున్నాడు జాబ్ చేసే సమయంలో దుండగులు ముసుగు వేసుకొచ్చి అతడిని డబ్బులు అడిగారు. భయపడిన సాయితేజ వెంటనే అతడి దగ్గర ఉన్న డబ్బులన్నీ వారికి ఇచ్చేశాడు. అయినా సరే వారు దారుణంగా సాయితేజ గుండెలపై కాల్చడంతో అక్కడికక్కడే చనిపోయాడు.
Similar News
News December 14, 2024
విద్యార్థులతో భోజనం చేసిన మంత్రి తుమ్మల
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ దమ్మపేట మండలం గండుగులపల్లి ఏకలవ్య గురుకుల పాఠశాలను సందర్శించారు. నూతన మెనూ కార్యక్రమాన్ని ప్రారంభించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. స్టూడెంట్స్ కు నాణ్యమైన భోజనం అందించాలని మెస్ ఛార్జీలు రెట్టింపు చేశామన్నారు. బాగా చదువుకుని ఉన్నత స్థాయికి చేరాలన్నారు. వారితో కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ ఉన్నారు.
News December 14, 2024
సమాఖ్య స్ఫూర్తికి జమిలి ఎన్నికలు విరుద్ధం: కూనంనేని
జమిలి ఎన్నికలు నిర్వహించాలనే కేంద్రం నిర్ణయం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. ఈ విధానంతో లాభాల కంటే నష్టాలే ఎక్కువ ఉన్నాయని చెప్పారు. ఖమ్మం జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. ఒకే దేశం – ఒకే ఎన్నిక విధానంతో ప్రాంతీయ పార్టీల హక్కులకు భంగం కలిగే అవకాశమున్నందున తాము వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.
News December 14, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు
> అశ్వారావుపేటలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన > కొత్తగూడెం కోర్టులో జాతీయ లోక్ అదాలత్ > పాలేరు నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటన > న్యాయవాదులకు ఉచిత వైద్య శిబిరం > డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన > బూర్గంపాడు: విద్యుత్ సరఫరాకు అంతరాయం > ఖమ్మంలో సీపీఎం నిరసన