News June 7, 2024
KMM: నా భర్త నాకు కావాలంటూ భార్య ధర్న
తన భర్త తనకు కావాలంటూ భార్య అత్తింటి ఎదుట ఆందోళనక దిగింది. స్థానికులు తెలిపిన వివరాలు..ఖమ్మం జిల్లా కల్లూరు వాసి మణికిషన్‌కు పెనుబల్లి మండలం యడ్లబంజార్ వాసి మౌనికకు నాలుగేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లయిన 6నెలల తర్వాత మౌనికను పుట్టింటికి పంపించిన భర్త ఆమెను తిరిగి తీసుకురాలేదు. పెద్దమనుషులు చెప్పినా ఫలితం లేకపోవడంతో మౌనిక కొడుకు(3)తో అత్తారింటి ముందు ఆందోళనకు దిగింది. పోలీసులు వచ్చి సర్ది చెప్పారు.
Similar News
News December 10, 2024
ఆ సాగు ప్రోత్సాహానికి కేంద్రం తీసుకుంటున్న చర్యలేంటి?: ఎంపీ
ఖమ్మం: పామాయిల్ పంట సాగు ప్రోత్సాహానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది..? అని ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి లోక్ సభలో ప్రశ్నించారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా.. ఎంపీ మాట్లాడుతూ.. ముఖ్యంగా నీటి ఎద్దడి ఉన్న తెలంగాణ ప్రాంతంలో.. ప్రత్యేకంగా ఏమైనా కార్యక్రమాలు నిర్వహిస్తుందా..? అని లిఖిత పూర్వకంగా అడిగారు.
News December 10, 2024
ఖమ్మం: మాస్ కాపీయింగ్.. 22 మంది విద్యార్థులు డిబార్
కాకతీయ యూనివర్సిటీ పరిధిలో సోమవారం జరిగిన డిగ్రీ పరీక్షలలో మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతూ 22 మంది విద్యార్థులు పట్టుబడినట్లు కేయూ పరీక్షల నియంత్రణ అధికారి కట్ల రాజేందర్ తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో 12 మంది, ఆదిలాబాద్‌లో ఐదుగురు, ఖమ్మంలో ఐదుగురు విద్యార్థులు చిట్టీలు రాస్తూ పట్టుబడగా వారిని డిబార్ చేసినట్లు చెప్పారు.
News December 10, 2024
ఇందిరమ్మ ఇళ్ల సర్వేకు సహకరించాలి:కలెక్టర్
ఖమ్మం:ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో జిల్లా ప్రజలందరూ పాల్గొని సరైన సమాచారం అందించి అధికారులకు సహకరించాలని సోమవారం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఒక ప్రకటనలో కోరారు. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను సేకరించి మొబైల్ యాప్‌లో నమోదు చేయడానికి సర్వే చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు ఏమైనా సందేహాలు ఉంటే అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని తెలిపారు.