News January 15, 2025
KMM: పండుగపూట.. యువకుడి కిడ్నాప్ కలకలం!

పండగపూట యువకుడు కిడ్నాప్‌నకు గురైన ఘటన ఖమ్మంలో చోటుచేసుకుందని స్థానికులు తెలిపారు. వారి వివరాలిలా.. పోలెపల్లి రాజీవ్ గృహ కాలనీకి చెందిన సంజయ్ కుమార్ సోమవారం రాత్రి తన అన్నను తీసుకురావడానికి బస్టాండ్‌కు వెళ్తుండగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని అన్న సాయికి సంజయ్ కుమార్ ఫోన్ చేశాడు. కొద్ది సేపటికే సంజయ్ ఫోన్ కలవకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.
Similar News
News February 19, 2025
భద్రాచలం చెక్‌పోస్ట్ వద్ద భద్రత పెంపు

భద్రాచలం పట్టణంలోని బ్రిడ్జి పాయింట్ వద్ద ఉన్న ఉమ్మడి చెక్‌పోస్ట్ వద్ద మంగళవారం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆదేశాల మేరకు అదనపు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇటీవల గంజాయి స్మగ్లర్లు ద్విచక్ర వాహనంతో వాహనాల తనిఖీ చేస్తున్న ఓ పోలీస్ కానిస్టేబుల్‌ని వేగంగా ఢీకొట్టి పారిపోయాడు. ఇలాంటి ఘటనలు మరోమారు ఉత్పన్నం కాకుండా భద్రాచలం టౌన్ సీఐ రమేశ్ ఆధ్వర్యంలో తగు చర్యలు చేపట్టారు.
News February 19, 2025
కొత్తగూడెం: వివాహేతర సంబంధం.. ఇద్దరికి దేహశుద్ధి..!

భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గాండ్లగూడెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో పాటు ఖమ్మంపాడుకు చెందిన మరో వ్యక్తిని మంగళవారం సాయంత్రం చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశామని ఖమ్మంపాడు గ్రామస్థులు తెలిపారు. ఖమ్మంపాడులోని ఓ వివాహితతో గాండ్లగూడెం వాసి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని,ఆమె కుటుంబ సభ్యులు గమనించగా ఇద్దరిని పట్టుకుని దేహశుద్ధి చేశామని చెప్పారు.అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చామన్నారు.
News February 19, 2025
ఖమ్మం: ‘యువతిని పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు’

ఖమ్మం జిల్లా పువ్వాడ ఉదయ్ నగర్ కాలనీకి చెందిన యువతిని అదే కాలనీకి చెందిన సంగాల నరసింహారావు పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని వీరనారీమణుల ఆశయ సాధన సమితి సభ్యులు ఆరోపించారు. రఘునాథపాలెంలో సమితి జిల్లా అధ్యక్షురాలు భూక్య ఉపేంద్రబాయి, జిల్లా కార్యదర్శి స్పందనను బాధితురాలు మంగళవారం కలిసింది. ఈ మేరకు ఉపేంద్రబాయి మాట్లాడుతూ.. పోలీసులు స్పందించి బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.