News June 7, 2024
KMM: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక అప్డేట్

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఫలితం తేలకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు. ఇప్పటివరకు 26 మంది ఎలిమినేట్ అయ్యారు. 27వ అభ్యర్థి ఓట్ల లెక్కింపు జరుగుతున్నది. ఎలిమినేషన్ రౌండ్స్లో కాంగ్రెస్కు 220 ఓట్లు రాగా, BRSకు 139 ఓట్లు, BJPకి 118 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి అశోక్కు 76 ఓట్లు పోలయ్యాయి. మల్లన్న ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
Similar News
News November 15, 2025
ఖమ్మం: చెరువులకు చేరుతున్న ‘చేప పిల్లలు’

ఖమ్మం జిల్లా మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మత్స్యశాఖాధికారి జి. శివప్రసాద్ తెలిపారు. జిల్లాలోని 882 చెరువులలో మొత్తం 3.48 కోట్ల చేప పిల్లలను వదిలేందుకు కార్యాచరణ రూపొందించారు. ఇప్పటివరకు 202 చెరువుల్లో 65 లక్షల కట్ల, రవ్వు, మరిగాల చేప పిల్లలను విడుదల చేశారు. మత్స్యకారుల స్వావలంబన కోసమే ఈ కార్యక్రమం జరుగుతోందని ఆయన వివరించారు.
News November 14, 2025
భూ సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: కలెక్టర్

భూ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని శుక్రవారం నిర్వహించిన వీసీలో ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి హెచ్చరించారు. భూ భారతి, సాదా బైనామా, రెవెన్యూ సదస్సుల పెండింగ్ దరఖాస్తులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనర్హుల దరఖాస్తులను డెస్క్ స్క్రూటినీలో తిరస్కరించాలని, అర్హుల దరఖాస్తులకు క్షేత్రస్థాయిలో తప్పనిసరి పరిశీలన చేయాలన్నారు.
News November 14, 2025
ఖమ్మంలో దడ పుట్టిస్తున్న చలి

ఖమ్మం జిల్లాలో గత నాలుగు రోజులుగా వీస్తున్న చలిగాలుల తీవ్రతతో కనిష్ట ఉష్ణోగ్రతలు అసాధారణంగా పడిపోయాయి. ఈ చలికి హాస్టల్ విద్యార్థులు, వృద్ధులు వణికిపోతున్నారు. ముఖ్యంగా చిన్నారుల్లో వైరల్ న్యుమోనియా వ్యాప్తి చెందుతుండటంతో పిల్లలు, వృద్ధులు ఆసుపత్రులకు వెళ్తున్నారు. శ్వాసకోశ ఇబ్బందులను నిర్లక్ష్యం చేయవద్దని, చలి నుంచి రక్షణ పొందేందుకు తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్య అధికారులు ప్రజలకు సూచించారు.


