News December 29, 2024
KMM: పత్తి చేనులో విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి

కరెంట్ షాక్తో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మధిర మండలంలో ఈరోజు తెల్లవారుజామున జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలిలా… మధిర మండలం దెందుకూరు గ్రామ సమీపంలో పత్తి చేనులో వేటగాళ్లు విద్యుత్ తీగలు అమర్చారు. అవి తగిలి చర్చి ఫాదర్ మీసాల శ్రీనివాసరావు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News September 13, 2025
ఖమ్మం జిల్లాలో 15 నుంచి ప్రైవేట్ విద్యాసంస్థల బంద్

ఖమ్మం జిల్లాలో ఈ నెల 15 నుంచి ప్రైవేటు విద్యాసంస్థలు బంద్ పాటించనున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రైవేటు విద్యాసంస్థల బాధ్యులు మల్లెంపాటి శ్రీధర్ తెలిపారు. ఖమ్మంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బకాయిలు చెల్లించే వరకు ఆందోళన కొనసాగిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో పలు విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.
News September 13, 2025
ఖమ్మం: కాంగ్రెస్లో వర్గపోరు.. పరస్పరం దాడులు

బోనకల్ మండలంలో కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు భగ్గుమంది. గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద రెండు వర్గాల నాయకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో ఒక వ్యక్తి చెవి తెగిపోగా, మరొకరిని మహిళలు చెప్పులతో కొట్టి గాయపరిచారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఇరు వర్గాల వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News September 13, 2025
ఖమ్మం: పత్తి కొనుగోళ్లపై అదనపు కలెక్టర్ ఆదేశాలు

ఖమ్మం జిల్లాలో పత్తి రైతులకు ఇబ్బందులు లేకుండా మద్దతు ధరతో కొనుగోళ్లు జరగాలని అ.కలెక్టర్ శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో పత్తి కొనుగోళ్లపై సీసీఐ అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో 2,25,613 ఎకరాల్లో పత్తి సాగు చేశారని, 27,07,356 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేసినట్లు తెలిపారు. జిల్లాలో 5సిసిఐ కేంద్రాలు, 9 జిన్నింగ్ మిల్లుల వద్ద కొనుగోళ్లు జరుగుతాయని పేర్కొన్నారు.