News April 20, 2025
KMM: పేరెంట్స్ మందలించారని యువకుడి SUICIDE

తల్లిదండ్రులు మందలించారని కుమారుడు గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఖమ్మం(D) నేలకొండపల్లి(M) శంకరగిరి తండాలో చోటుచేసుకుంది. తండాకు చెందిన ధరావత్ రాజు(24) ఏ పని చేయకుండా కాళీగా ఉంటున్నాడని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడని తెలిపారు. ఒక్కగానొక్క కుమారుడు మరణించడంతో తల్లిదండ్రులు కన్నీటిపర్యాంతమయ్యారు. గ్రామంలో విషాదం నెలకొంది.
Similar News
News April 21, 2025
కొల్హాపూర్, కామాఖ్యలో ఆలయాలను దర్శించుకున్న సూర్య దంపతులు

తమిళ నటుడు సూర్య తన భార్య జ్యోతికతో కలిసి పుణ్యక్షేత్రాల్ని దర్శించుకుంటున్నారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్ మహాలక్ష్మి, అస్సాంలోని కామాఖ్య ఆలయాల్లోని శక్తిపీఠాలను తాజాగా దర్శనం చేసుకున్నారు. అందుకు సంబంధించిన ఫొటోను వారు సోషల్ మీడియాలో పంచుకోగా ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. కాగా.. సూర్య నటించిన రెట్రో వచ్చే నెల 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.
News April 21, 2025
భార్య కనిపించడం లేదని పోలీస్ కంప్లైంట్.. కట్ చేస్తే..

UPలోని అలీగఢ్‌కు చెందిన షకీర్(40) అనే వ్యక్తి తన భార్య అంజుమ్, నలుగురు పిల్లలు ఈ నెల 15 నుంచి కనిపించడం లేదంటూ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులకూ వారి ఆచూకీ లభించలేదు. తాజాగా షకీర్ బంధువులకు ఆమె తాజ్‌మహల్ వద్ద మరో వ్యక్తితో కలిసి కనిపించింది. వారు వాట్సాప్‌లో వీడియో పంపించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వ్యక్తి తెలిసినవాడేనని, తన భార్యను తన వద్దకు చేర్చాలని షకీర్ అధికారుల్ని కోరాడు.
News April 21, 2025
IPL: ముంబై సునాయాస విజయం

చెన్నై చాలా కష్టంగా చేసిన 176 పరుగుల లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ ఉఫ్‌మని ఊదేసింది. రోహిత్ హాఫ్ సెంచరీ(76*)తో ఫామ్‌లోకి రాగా అటు సూర్య కూడా తనదైన శైలిలో అర్ధ శతకం(68*) చేయడంతో 16వ ఓవర్లోనే MI టార్గెట్‌ను ఛేదించింది. చెన్నై బౌలర్లలో జడేజాకు మాత్రమే వికెట్ దక్కింది. ఈ ఓటమితో చెన్నై ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి.