News May 24, 2024

KMM: ప్రయాణికులపై ట్రాన్స్‌జెండర్ల దాడి

image

ఒడిశా వెళ్తున్న కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో ఇద్దరు ట్రాన్స్‌జెండర్లు రెచ్చిపోయారు. జనరల్ బోగిలో ఎక్కిన వారు ప్రయాణికులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈనేపథ్యంలో బలరాం వారు అడిగినంత డబ్బు ఇవ్వకపోవడంతో అతడితో పాటు మరికొందరిపై దాడి చేశారు. మహబూబాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో ఈ ఘటన జరగగా, సదరు యువకులు ఖమ్మం రైల్వేస్టేషన్‌లో ఫిర్యాదు చేస్తామని తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 15, 2025

ఖమ్మం: చెరువులకు చేరుతున్న ‘చేప పిల్లలు’

image

ఖమ్మం జిల్లా మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మత్స్యశాఖాధికారి జి. శివప్రసాద్ తెలిపారు. జిల్లాలోని 882 చెరువులలో మొత్తం 3.48 కోట్ల చేప పిల్లలను వదిలేందుకు కార్యాచరణ రూపొందించారు. ఇప్పటివరకు 202 చెరువుల్లో 65 లక్షల కట్ల, రవ్వు, మరిగాల చేప పిల్లలను విడుదల చేశారు. మత్స్యకారుల స్వావలంబన కోసమే ఈ కార్యక్రమం జరుగుతోందని ఆయన వివరించారు.

News November 14, 2025

భూ సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: కలెక్టర్

image

భూ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని శుక్రవారం నిర్వహించిన వీసీలో ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి హెచ్చరించారు. భూ భారతి, సాదా బైనామా, రెవెన్యూ సదస్సుల పెండింగ్ దరఖాస్తులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనర్హుల దరఖాస్తులను డెస్క్ స్క్రూటినీలో తిరస్కరించాలని, అర్హుల దరఖాస్తులకు క్షేత్రస్థాయిలో తప్పనిసరి పరిశీలన చేయాలన్నారు.

News November 14, 2025

ఖమ్మంలో దడ పుట్టిస్తున్న చలి

image

ఖమ్మం జిల్లాలో గత నాలుగు రోజులుగా వీస్తున్న చలిగాలుల తీవ్రతతో కనిష్ట ఉష్ణోగ్రతలు అసాధారణంగా పడిపోయాయి. ఈ చలికి హాస్టల్ విద్యార్థులు, వృద్ధులు వణికిపోతున్నారు. ముఖ్యంగా చిన్నారుల్లో వైరల్ న్యుమోనియా వ్యాప్తి చెందుతుండటంతో పిల్లలు, వృద్ధులు ఆసుపత్రులకు వెళ్తున్నారు. శ్వాసకోశ ఇబ్బందులను నిర్లక్ష్యం చేయవద్దని, చలి నుంచి రక్షణ పొందేందుకు తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్య అధికారులు ప్రజలకు సూచించారు.