News November 11, 2024
KMM: ప్రేమ పేరుతో మోసం.. MLA వద్దకు యువతి
ప్రేమ పేరుతో మోసం చేసిన యువకుడిపై చర్యలు తీసుకోవాలని గార్ల మండలంలోని పెద్ద కిష్టాపురంకి చెందిన భూక్య సంగీత సోమవారం ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్యను వేడుకుంది. ముల్కనూరులో సీసీ రోడ్డు పనుల ప్రారంభోత్సవానికి వచ్చిన MLAను కలిసి వినతి పత్రం అందజేసింది. పెద్దకిష్టాపురానికి చెందిన శ్రీకాంత్ తనను మోసం చేసినట్లు పేర్కొంది. ఈ విషయమై PSలో ఫిర్యాదు చేశానని, న్యాయం చేయాలని MLAని కోరింది.
Similar News
News December 2, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు
∆} మధిరలో ప్రజా విజయోత్సవాల కార్యక్రమం ∆} ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన ∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభం ∆} మణుగూరులో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పర్యటన ∆} అన్నపురెడ్డిపల్లి శివాలయంలో ప్రత్యేక పూజలు ∆} కారేపల్లిలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన ∆} భద్రాద్రి జిల్లాలో ప్రజావాణి కార్యక్రమం రద్దు ∆} ఎమ్మెల్యే రాగమయి పర్యటన
News December 2, 2024
మధిరలో ప్రజా విజయోత్సవాలు: కలెక్టర్
ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల కార్యక్రమాలలో భాగంగా నేడు మధిరలోని రెడ్డి రెడ్డి గార్డెన్స్‌లో సాంస్కృతిక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజా ప్రతినిధులు, ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.
News December 1, 2024
పాడి పశువుల పెంపకానికి చేయూత: భద్రాద్రి కలెక్టర్
పాడి పశువుల పెంపకానికి మరింత చేయూతను అందిస్తామని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. ఆదివారం బూర్గంపాడు మండలం నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పీవీ నరసింహారావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయాల జాతీయ సేవా పథకంలో భాగంగా పశు వైద్య శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. పాడి పశువుల పెంపకం అనేది కొంచెం కష్టమైన పని అయినప్పటికీ దాని ద్వారా లాభాలను అర్జించవచ్చని తెలిపారు.