News July 10, 2024

KMM: బాలికను గర్భవతిని చేసిన యువకుడు

image

బాలికను ప్రేమ పేరుతో ఓ యువకుడు గర్భవతిని చేశారు. ఎస్ఐ రవి కథనం ప్రకారం.. చండ్రుగొండ మండలంలోని ఇమ్మిడిరామయ్యబంజర్‌ వాసి కంపసాటి రవి ఓ బాలికను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ దృశ్యాలను ఫోన్‌లో బంధించానని ఎవరికైనా చెబితే వాట్సాప్‌లో పెడతానని బెదిరించాడు. బాలిక గర్భవతి కావడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువకుడిపై పోక్సో కేసు నమోదైంది.

Similar News

News February 23, 2026

ఏఐ వినియోగంతో మెరుగైన ఫలితాలు: కలెక్టర్ అనుదీప్

image

జిల్లా పరిపాలనలో ఏఐ సాంకేతికత ‘క్లాడ్’ వాడకం ద్వారా సత్ఫలితాలు సాధించవచ్చని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా అధికారులకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఎక్సెల్ షీట్లు, నివేదికల తయారీలో ఏఐని ఎలా ఉపయోగించాలో వివరించారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని పనులను వేగవంతం చేయాలని సూచించారు. అధికారులు విధి నిర్వహణలో ఏఐ టూల్స్ వినియోగించాలని కోరారు.

News February 23, 2026

‘దిశ’ సమావేశానికి అధికారులు సిద్ధంగా రావాలి: కలెక్టర్

image

ఈ నెల 27న నిర్వహించే ‘దిశ’ సమావేశానికి అధికారులు పూర్తి సమాచారంతో హాజరుకావాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో పరిపాలన అంశాలపై సమీక్షించారు. సత్తుపల్లిలో అటవీ ఉత్పత్తుల మార్ట్ నిర్మాణానికి రూ.10 లక్షల ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, భూసేకరణ కేసులు, భూ భారతి దరఖాస్తులపై త్వరితగతిన నివేదికలు సమర్పించాలని అధికారులను సూచించారు.

News February 23, 2026

ఖమ్మం: ‘వేసవిలో నిరంతర విద్యుత్ సరఫరాకు సిద్ధం’

image

రాబోయే వేసవిలో విద్యుత్ డిమాండ్ పెరిగినా అంతరాయం లేకుండా సరఫరా చేస్తామని ఎస్‌ఈ శ్రీనివాసాచారి తెలిపారు. ఇప్పటికే గరిష్ఠ డిమాండ్ 5,904మెగావాట్లకు చేరిందని పేర్కొన్నారు. అదనంగా 110కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు, మంచుకొండ వద్ద కొత్త సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఓవర్ లోడ్ సమస్య లేకుండా సామర్థ్యాన్ని పెంచామని వివరించారు. నాణ్యమైన విద్యుత్ అందించేందుకు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు.