News April 6, 2024

KMM: భానుడి భగభగ.. ప్రజలు విలవిల

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భానుడు భగభగమంటున్నాడు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురువారం 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. దీంతో ఇండ్లలో నుంచి బయటికి రావాలంటే ప్రజలు జంకుతున్నారు. రోడ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ప్రయాణికులు శీతల పానీయాలు తాగుతూ.. సేద తీరుతున్నారు. వృద్ధులు చిన్నారుల పరిస్థితి మరి దారుణంగా ఉంది. ఏప్రిల్ నెలలో ఇంత ఉష్ణోగ్రత ఉంటే మే నెలలో ఎలా ఉంటుందో అని ఆందోళన చెందుతున్నారు.

Similar News

News December 25, 2025

ఖమ్మంలో విషాదం నింపిన ఘటనలు

image

ఖమ్మం జిల్లాలో బుధవారం జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. నగరంలోని సాగర్ కాలువలో ఈతకు వెళ్లిన అబ్దుల్ సుహాన్, శశాంక్ అనే మిత్రులు కొట్టుకుపోయారు. నాయకన్‌గూడెంలో మరో విషాదం చోటుచేసుకుంది. పాఠశాలలో ఆడుకుంటూ కిందపడగా జేబులోని పెన్సిల్ ఛాతికి గుచ్చుకుని విహార్ అనే చిన్నారి మృతి చెందాడు.

News December 25, 2025

మెడికల్ ఆఫీసర్ అభ్యంతరాలకు 27 వరకు గడువు

image

జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఖమ్మం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీగా ఉన్న నాలుగు మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాను అధికారిక వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచినట్లు DM&HO తెలిపారు. ఈ జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే నేటి నుంచి 27వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు సంబంధిత ధ్రువపత్రాలతో DM&HO కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.

News December 25, 2025

అంబేడ్కర్‌ వర్సిటీ పరీక్ష ఫీజు గడువు 27 వరకు

image

ఖమ్మం ఎస్‌ఆర్‌ అండ్‌ బీజీఎన్‌ఆర్‌ ప్రభుత్వ కళాశాల అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయ విద్యార్థులు ఈ నెల 27లోగా పరీక్ష ఫీజు చెల్లించాలని ప్రిన్సిపల్‌ డాక్టర్‌ మహమ్మద్‌ జాకీరుల్లా తెలిపారు. డిగ్రీ 1, 3, 5 సెమిస్టర్‌ విద్యార్థులకు ఈ గడువు వర్తిస్తుందన్నారు. రూ.1000 అపరాధ రుసుముతో జనవరి 7 వరకు అవకాశం ఉందని పేర్కొన్నారు. పీజీ సప్లిమెంటరీ విద్యార్థులు కూడా ఫీజు చెల్లించవచ్చన్నారు.