News March 30, 2024
KMM: భార్యను కాపాడబోయి భర్త మృతి

విద్యుత్ షాక్తో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన పెనుబల్లి మండలంలో శుక్రవారం జరిగింది. స్థానికులు కథనం ప్రకారం.. కుప్పెనకుంట్లకి చెందిన వల్లవరపు రవి(43) భార్య ప్రమాదవశాత్తు విద్యుత్ తీగను తాకడంతో షాక్కు గురైంది. రవి ఆమెను కాపాడే క్రమంలో షాక్కు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Similar News
News October 17, 2025
ఖమ్మం జిల్లాలో రేపు విద్యాసంస్థలు బంద్

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రేపు విద్యాసంస్థల బంద్ ఉంటుందని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు మస్తాన్, సుధాకర్, సురేష్ తెలిపారు. బీసీల 42 శాతం రిజర్వేషన్ బిల్లును ఆమోదించకపోవడాన్ని నిరసిస్తూ రేపటి బంద్కు మద్దతు ప్రకటిస్తున్నట్లు శుక్రవారం నిర్వహించిన సమావేశంలో చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హక్కులను కాల రాస్తుందని వారు పేర్కొన్నారు.
News October 17, 2025
ఖమ్మం జిల్లాలో 1,164 మద్యం టెండర్ల దరఖాస్తులు

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మద్యం టెండర్ల కోసం గురువారం నాటికి 1,164 వచ్చినట్లు అధికారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా గత వారం రోజులుగా 672 దరఖాస్తులు రాగా గురువారం ఒక్క రోజే 492 దరఖాస్తులు అందాయి. ఖమ్మం ఎక్సైజ్ 1 స్టేషన్ పరిధిలోని మద్యం దుకాణాలకు 395 దరఖాస్తులు రాగా, ఖమ్మం-2 ఎక్సైజ్ స్టేషన్కు 215, నేలకొండపల్లి-90, వైరా-81, మధిర-98, సత్తుపల్లి- 247, సింగరేణి-40 దరఖాస్తులు నమోదయ్యాయి.
News October 17, 2025
ఆ ఆసుపత్రుల్లో ఆశించిన పురోగతి లేదు: ఖమ్మం కలెక్టర్

మెరుగైన సేవలతో ప్రభుత్వ వైద్యం పట్ల నమ్మకం కలిగించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల పనితీరుపై సమీక్షించారు. వైద్య విధానం పరిషత్ ఆసుపత్రులలో ప్రసవాలు జులైలో 47 నుంచి సెప్టెంబర్ 74కు చేరాయని, తిరుమలాయపాలెం, నేలకొండపల్లి ఆసుపత్రిలో మంచి ఫలితాలు రాగా, కల్లూరు, వైరా, సత్తుపల్లి , పెనుబల్లి, మధిర ఆసుపత్రులలో ఆశించిన పురోగతి లేదన్నారు.